Teja Sajja: భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న యువ హీరో..

* భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న యువ హీరో

Dhatripriya
Updated on: 3 March 2023 8:01 AM IST
Teja Sajja Demanding 25 Lakhs For A Day Shooting
X

ఒక్కరోజు షూటింగ్ కి పాతిక లక్షలు డిమాండ్ చేస్తున్న యువ హీరో

Teja Sajja: చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైన తేజ సజ్జా సమంత హీరోయిన్ గా నటించిన "ఓ బేబీ" సినిమాతో నటుడిగా ప్రేక్షకులను పలకరించాడు. "జాంబి రెడ్డి" సినిమాతో హీరోగా కూడా మారిన తేజ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత "అద్భుతం" అనే సినిమాలో నటించిన తేజ ఇప్పుడు 'హను-మాన్' అనే ఒక ఆసక్తికరమైన సినిమాతో త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

టాలీవుడ్ లో విడుదల కాబోతున్న మొట్టమొదటి సూపర్ హీరోగా ఈ చిత్రం ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆసక్తికరమైన కథలను ఎంచుకోవడంలో తేజ సజ్జ బాగానే సక్సెస్ అయ్యాడు అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే తేజకి మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఒకవైపు సినిమాలు మాత్రమే కాక మరోవైపు బ్రాండ్ ఎండార్స్మెంట్ తో కూడా తేజా చాలా బిజీగా గడుపుతున్నాడు. ఈ మధ్యనే ఒక భారీ బడ్జెట్ కమర్షియల్ యాడ్ కి నటించిన తేజ ఏకంగా పాతిక లక్షల రెమ్యూనరేషన్ ఒక్కరోజు షూటింగ్ చేసినందుకు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక హైదరాబాద్లో ఇప్పటికే తేజ ఎన్నో షాపులను ఓపెన్ చేశాడు. చిన్న వయసులోనే ఆసక్తికరమైన సినిమాలు మరియు విభిన్న కథ లతో తేజ సజ్జ ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాడు. మరి 'హను-మాన్' సినిమా తో తేజ ఎంత వరకు హిట్ అందుకొని తన కెరియర్ లో మైలురాయి సినిమాగా మార్చుకుంటాడో వేచి చూడాలి.

Dhatripriya

Dhatripriya

Next Story