Teja Sajja: జాంబీరెడ్డి హీరోతో స్టార్ ప్రొడ్యూసర్ సినిమా?

Teja Sajja: జాంబీరెడ్డి సినిమాతో ఆకట్టుకున్నాడు తేజ సజ్జ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా బాగానే కలెక్షన్స్ రాబట్టింది.

Venkata Chari
Published on: 21 May 2021 2:54 PM IST
Teja Sajja Crazy Project with Vyjayanthi Movies Banner | Tollywood New Movies
X
తేజ సజ్జ (ఫొటో ట్విట్టర్)

Teja Sajja: జాంబీరెడ్డి సినిమాతో ఆకట్టుకున్నాడు తేజ సజ్జ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా బాగానే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాలో తేజ సజ్జ నటనకు ఫుల్ మార్కులే వచ్చాయి. దీంతో వరుసగా సినిమా అవకాశాలు ఈ యంగ్ హీరో తలపు తడుతున్నాయి.

ప్రస్తుతం తేజ సజ్జ రెండు సినిమాలు లైన్ లో పెట్టాడు. ప్రముఖ నిర్మాత ఆర్ బీ చౌదరి నిర్మాణంలో మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ లో 'ఇష్క్.. నాట్ ఏ లవ్ స్టోరీ' సనిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఇక శివానీ రాజశేఖర్ తో కలిసి 'వెన్నెల' అనే మరో మూవీలోనూ కనిపించనున్నాడు.

ఇక మూడో సినిమాను లైన్ లో పెట్టేందుకు రెడీ అయ్యాడని టాక్ వినిపిస్తోంది. అదికూడా ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ లో ఓ మూవీ చేసేందుకు ఓకే చేశాడని సమాచారం తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ బ్యానర్ లో ఎన్నో హిట్ మూవీస్ టాలీవుడ్‌లో విడుదలయ్యాయి. అలాంటి పెద్ద బ్యానర్‌లో సినిమా చేస్తుండడంతో తేజ సజ్జ కు బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. కాగా, ఈ బ్యానర్లోనే మెగాస్టార్ 'చూడాలనివుంది' సినిమాతో బాల నటుడిగా అరంగేట్రం చేశాడు తేజ. ఇక మరో సినిమా ఇంద్ర లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి ఔరా అనిపించాడు. తాజాగా అదే బ్యానర్ లో హీరోగా చేయనుండడం విశేషం.

Venkata Chari

Venkata Chari

Next Story