బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం

బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం

Arun Chilukuri
Published on: 7 Jan 2023 11:01 AM IST
Technical Glitch Reported in Balkrishnas Helicopter
X

బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం

Balkrishna: బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఒంగోలు నుండి హైదరాబాద్‌కు బయల్దేరిన విమానం.. కాసేపటికే లోపం ఉన్నట్లు పైలెట్‌ గుర్తించాడు. దాంతో తిరిగి మళ్లీ ఒంగోలులోనే ల్యాండింగ్‌ చేశాడు. ప్రస్తుతం టెక్నీషియన్స్‌ లోపాన్ని సవరించేపనిలో ఉన్నారు. నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ''వీర సింహారెడ్డి'' విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న ఒంగోల్‌లో ''వీర సింహారెడ్డి'' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి బాలయ్య హెలికాఫ్టర్‌లో వచ్చారు. నిన్న రాత్రి ఈవెంట్‌ పూర్తయిన తర్వాత కూడా ఒంగోల్‌లోనే ఉన్నారు. ఈ ఉదయం హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం అయ్యారు. కాసేపటికే హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం ఉన్నట్లు పైలెట్‌ గుర్తించాడు. దీంతో దాన్ని మళ్లీ ఒంగోలులో లాండ్‌ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story