హర్భజన్ సింగ్ 'ఫ్రెండ్‌షిప్' ఫస్ట్ లుక్ అదుర్స్

భారత జట్టు సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. తన స్పిన్ మాయజలంతో క్రికెటర్‌గా తన సత్తా చాటిన భజ్జీ.

Samba Siva Rao
Updated on: 6 Jun 2020 10:03 AM IST
హర్భజన్ సింగ్ ఫ్రెండ్‌షిప్ ఫస్ట్ లుక్ అదుర్స్
X

భారత జట్టు సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. తన స్పిన్ మాయజలంతో క్రికెటర్‌గా తన సత్తా చాటిన భజ్జీ. ఇక వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైయ్యాడు. హర్భజన్ సింగ్ 2016లో టీమిండియాకు దూరమైన తమిళ సినిమా 'ఫ్రెండ్‌షిప్' ద్వారా వెండితెరకు ఎంట్రీ ఇస్తున్నాడు. గతంలో పలు యాడ్స్‌లో నటించిన హర్భజన్ పూర్తి స్థాయి సినిమాలో నటించడం మాత్రం ఇదే తొలిసారి.

ప్రముఖ నటుడు అర్జున్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. హర్భజన్ అభిమానులను అమితంగా అకట్టుకుంటోంది. ఈ సినిమాలో ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో విడుదలైన కొద్ది సేపటికే వైరల్‌గా మారింది. చెన్నైతో 39 ఏళ్ల వయస్కుడైన హర్భజన్ సింగ్‌కు ఇప్పటికే ప్రత్యేక అనుబంధం ఉంది.

ఐపీఎల్ మూడు సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడిగా హర్భజన్ సింగ్ ప్రాతినిధ్యం వహించాడు తమిళనాడు క్రికెట్ అభిమానులకు మరింత దగ్గర అయ్యాడు. మరోవైపు ఇప్పటికే తమిళ సినీ అభిమానుల ఆదరణ పొందాడు. భారత క్రికెట్ జట్టు తరవున 236 వన్డేల్లో 269 వికెట్లు తీశాడు. మూడు వికెట్లు ఐదు సార్లు తీశాడు. 103 టెస్టుల్లో 417 వికెట్లు తీసాడు. 25 సార్లు ఐదు వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు.




Samba Siva Rao

Samba Siva Rao

Next Story