Bala Krishna: క‌రోనా బాధితులకు బాల‌య్య సాయం

Bala Krishna: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది.

Samba Siva Rao
Published on: 13 May 2021 3:08 PM IST
Bala Krishna helps Covid Patients
X

బాలకృష్ణ  ఫైల్ ఫోటో 

Bala Krishna: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు ఈ ప్రాణాంత‌క వైర‌స్ బారిన ప‌డేవారి సంఖ్య పెరిపోతుంది. మరోవైపు అస్పత్రుల్లో ప‌డ‌క‌లు, ఆక్సీజ‌న్ కొర‌త ఏర్ప‌డింది. ఈ వైరప ఎప్పుడు ఎవ‌రికీ సోకుతుందో అనే భ‌యంలో ప్ర‌జ‌లు ఇళ్ల‌లో నుంచి బయ‌ట‌కు రావ‌డం లేదు. క‌రోనా నియంత్ర‌ణ‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ప్ర‌తిప‌క్ష‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో హిందూపురం ఎమ్మెల్యే, సినీన‌టుడు నంద‌మూరి బాలకృష్ణ ప్ర‌జ‌ల‌కు సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చారు. రూ.20 ల‌క్ష‌ల విలువ చేసే క‌రోనా మందుల‌ను సాయంగా అందిస్తున్నారు. హిందూపురంలోని చౌడేశ్వరి కాలనీలోని బాల‌య్య‌ నివాసం వద్ద స్థానిక టీడీపీ నాయకులు వాటిని ప్ర‌జ‌లకు అందజేశారు.

క‌రోనా లక్షణాలు ఉన్న వారు ఆధార్ కార్డుతో బాల‌య్య నివాసానికి వస్తే, కరోనా మందులను అందజేస్తామని టీడీపీ నేత‌లు తెలిపారు. హిందూపురం ప్రజల ఇబ్బందులను అధ్యయనం చేసిన బాల‌కృష్ణ ఈ రూ.20 లక్షలు విలువ చేసే మందులను పంపిణీ చేస్తున్నార‌ని వారు వివ‌రించారు. ఇవి చాల‌క‌పోతే మరిన్ని కొవిడ్ ఔష‌ధాల‌ను కూడా ఇవ్వ‌డానికి త‌మ నేత సిద్ధంగా ఉన్నార‌ని చెప్పారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story