కమలహాసన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

ఇక 1954 నవంబర్‌ 7న తమిళనాడులోని పరమకుడిలో జన్మించారు కమలహాసన్.. ఆయన అసలు పార్థసారథి శ్రీనివాసన్‌.. సినిమాల్లోకి వచ్చాక అయన పేరును కమల్ హసన్ గా మార్చుకున్నారు..

Krishna
Published on: 7 Nov 2020 2:22 PM IST
కమలహాసన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
X

ప్రముఖ విలక్షణ నటుడు కమల్ హసన్ నేటితో 66 సంవత్సరాలు పూర్తి చేసుకొని 67వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు.. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులూ ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.. అందులో భాగంగానే ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా కమల్ హసన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు..

"భారతదేశ గొప్పనటుల్లో కమలహాసన్ ఎప్పటికీ ఒకరుగా ఉంటారు. ప్రజాక్షేమం, సమాజశ్రేయస్సు పట్ల శ్రద్ధ, ప్రజల పట్ల ఆప్యాయత ఎంతో ప్రశంసనీయం. ఆయన ఈ పుట్టినరోజును మరింత సంతోషంగా జరుపుకోవాలని, మరెన్నో దశాబ్దాల పాటు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను" అని చంద్రబాబు ట్వీట్ చేశారు..


ఇక 1954 నవంబర్‌ 7న తమిళనాడులోని పరమకుడిలో జన్మించారు కమలహాసన్.. ఆయన అసలు పార్థసారథి శ్రీనివాసన్‌.. సినిమాల్లోకి వచ్చాక అయన పేరును కమల్ హసన్ గా మార్చుకున్నారు.. 1959లో వచ్చిన 'కలతూర్‌ కన్నమ్మ'తో బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చేసిన మొదటి సినిమాకే అయన నటనకి గాను ఏకంగా రాష్ట్రపతి గోల్డ్‌మెడల్‌ వచ్చింది. ఆ తర్వాత తమిళ్, కన్నడ, మలయాళీ, హిందీ, తెలుగు భాషల్లో సినిమాలు చేశారు. ప్రస్తుతం సినిమాలతో పాటుగా రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నారు కమల్..

Krishna

Krishna

Next Story