Tasty Teja Remuneration: కామెడీతో నవ్వించడమే కాదు.. బిగ్‌బాస్ హౌస్‌లో భారీగానే సంపాదించిన టేస్టీ తేజ.. ఎంతంటే?

Bigg Boss 7 Telugu: టేస్టీ తేజ‌ ఎలిమినేషన్‌తో శోభా శెట్టి సేఫ్ జోన్‌లోకి వెళ్లింది.

Arun Chilukuri
Updated on: 6 Nov 2023 11:30 AM IST
Tasty Teja Remuneration for 9 Weeks in Bigg Boss 7 Telugu
X

Tasty Teja Remuneration: కామెడీతో నవ్వించడమే కాదు.. బిగ్‌బాస్ హౌస్‌లో భారీగానే సంపాదించిన టేస్టీ తేజ.. ఎంతంటే?

Bigg Boss 7 Telugu: టేస్టీ తేజ‌ ఎలిమినేషన్‌తో శోభా శెట్టి సేఫ్ జోన్‌లోకి వెళ్లింది. ఆటలో చూపించాల్సిన పోరాటం తిండి కోసం చూపించేవాడు. ఇంట్లో గుడ్లు, కూల్ డ్రింక్‌ల కోసం కక్కుర్తి పడేవాడు. అలాగే మిగతా కంటెస్టెంట్లపై లేనిపోని కారణాలతో నామినేట్ చేసేవాడు. నామినేషన్స్ అన్నా, ఎలిమినేషన్ అన్నా ఎంతో భయపడే టేస్టీ తేజను.. చివరకు శావాజీ చిన్న వార్నింగ్ ఇచ్చి నామినేట్ చేశాడు. దీంతో గత వారం నామినేట్ అయిన తేజ.. చివరకు జనాలు కూడా లైట్‌గా తీసుకోవడంతో ఎట్టకేలకు ఎలిమినేట్ అయ్యాడు.

అయితే, 9 వారాల పాటు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న తేజ.. ఇంతకాలం అసలు ఉంటాడనుకోలేదు. ప్రేక్ష‌కులు ఇన్నాళ్లు బిగ్ బాస్ హౌస్‌లో ఉంచడంతో తనను తానే న‌మ్మ‌లేక‌పోయాడు. తేజ పెద్దగా ఆడలేకపోయాడు. కానీ, హౌస్‌లో ఉన్నంత కాలం అందర్నీ క‌డుపుబ్బా నవ్వించేవాడు.

కంటెస్టెంట్ల మధ్య చిచ్చులు పెట్టేవాడు. ఒకరి మాటలు, మరొకరికి చెప్పి పచ్చిగడ్డిమీద పెట్రోల్ పోసేవాడు. అలాగే తను సేఫ్ జోన్‌లో ఉండేందుకు చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేసేవాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్లను కూడా నామినేష‌న్స్‌లోకి పంపించి, ఎలిమినేట్‌ చేసేందుకు హెల్ప్ చేసేవాడు.

రెమ్యున‌రేష‌న్ ఎంత తీసుకున్నాడంటే?

కాగా, 9 వారాలు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న టేస్టీ తేజ.. ఎలిమినేట్ అయ్యే వరకు.. బాగానే సంపాదించాడు. వారానికి దాదాపు రూ.1.75 ల‌క్ష‌లు తీసుకున్నాడు. ఇలా 9 వారాల‌కు మొత్తంగా దాదాపు రూ.16 లక్ష‌లు తీసుకున్నాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story