Trivikram Srinivas: మొదటి సినిమా హీరోకి మళ్లీ అవకాశం ఇస్తున్న త్రివిక్రమ్

ఒకప్పటి హీరోకి రెండవ చాన్స్ ఇస్తున్న త్రివిక్రమ్

Arun Chilukuri
Updated on: 4 Sept 2022 7:30 PM IST
Taruns Comeback With  Trivikram Srinivas Movie
X

Trivikram Srinivas: మొదటి సినిమా హీరోకి మళ్లీ అవకాశం ఇస్తున్న త్రివిక్రమ్

Trivikram Srinivas: ప్రస్తుతం మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకొని వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో కెరియర్లో ముందుకు దూసుకుపోతున్న డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు ముందే ఉంటుంది. నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక రైటర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టారు. అప్పట్లో కేవలం త్రివిక్రమ్ రైటింగ్ పై ఉన్న నమ్మకంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు తరుణ్. అప్పట్లో వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో లవర్ బాయ్ ఇమేజ్ తో కరియర్ లో పీక్ లో ఉన్న తరుణ్ త్రివిక్రమ్ మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించిన "నువ్వే నువ్వే" సినిమాలో హీరోగా నటించారు.

అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. అయితే ఆసక్తికరంగా "నువ్వే నువ్వే" సినిమా తర్వాత నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ అంచలంచలుగా ఎదుగుతూ రాగా తరుణ్ మాత్రం స్క్రిప్ట్ సెలక్షన్లలో ఇబ్బందుల వల్ల వరుస డిజాస్టర్లు అందుకున్నారు. ఇక ఈ మధ్యకాలంలో తరుణ్ వెండితెరపై కనిపించి కూడా చాలా కాలం అయింది.

ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమాలో తరుణ్ కి ఒక కీలక పాత్ర ఇచ్చారని వార్తలు వినిపించాయి కానీ తరుణ్ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ తరుణ్ కోసం కొన్ని మంచి కథలను వెతికే పనిలో పడ్డారని తెలుస్తోంది. అన్ని ఓకే అయితే స్వయంగా త్రివిక్రమ్ భార్య సౌజన్య సినిమాను నిర్మించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి తన మొట్టమొదటి సినిమాకి హీరోగా నటించిన తరుణ్ కెరియర్ నిలబెట్టడానికి త్రివిక్రమ్ ఏమైనా చేయగలరో లేదో చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story