logo
సినిమా

Taraka Ratna: ఎన్టీఆర్ తో పోటీ లేదు అంటున్న తారకరత్న..

Taraka Ratna Reacts on Disputes With Jr NTR
X

Taraka Ratna: ఎన్టీఆర్ తో పోటీ లేదు అంటున్న తారకరత్న..

Highlights

Taraka Ratna: నందమూరి కుటుంబం నుంచి తెలుగు తెరకి పరిచయమైన హీరోలలో తారకరత్న కూడా ఒకరు.

Taraka Ratna: నందమూరి కుటుంబం నుంచి తెలుగు తెరకి పరిచయమైన హీరోలలో తారకరత్న కూడా ఒకరు. 2002లో "ఒకటో నెంబర్ కుర్రాడు" అనే సినిమాతో హీరోగా మారిన తారకరత్న ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశారు కానీ అందులో ఒకటి కూడా తారకరత్న కి మంచి హిట్ ఇవ్వలేదు. ఆ తర్వాత అమరావతి సినిమాలో విలన్ పాత్రలో మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తారకరత్న ఆ తరువాత కనుమరుగైపోయారు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న తారకరత్న ప్రస్తుతం ఇప్పుడు తన కెరియర్ను గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తారకరత్న నందమూరి కుటుంబం గురించి ఎన్టీఆర్ తోటి తన సాన్నిహిత్యం గురించి చెప్పుకొచ్చారు.

నందమూరి ఫ్యామిలీ నన్ను దూరం పెట్టింది అని అంతా అనుకుంటున్నారు. కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదు. నన్ను మొదటి నుంచి ఎలా చూసుకుంటున్నారో ఇప్పుడు కూడా అలాగే చూసుకుంటున్నారు. ఎవరో ఏదో రాశారని అని నేను క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మా కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవు. మా తాతగారు మాకు నేర్పిన విలువలు వేరు. మా మధ్య ఉండే అనుబంధాలు, ఆప్యాయతలు వేరు. ఆయన మాకు వందల కోట్ల ఆస్తులను ఇచ్చారు అని అందరూ అంటారు కానీ కోట్ల మంది ప్రజల అభిమానాన్ని మాకు దక్కేలా చేశారు. అంతకంటే మాకు కావాల్సింది ఏదీ లేదు. అప్పట్లో ఎన్టీఆర్ కి పోటీ గా నన్ను లాంచ్ చేశారని కొందరు చెప్పారు. కానీ అందులో ఏ మాత్రం నిజం లేదు. హీరో కావాలనే నా కల నా కుటుంబ సభ్యులు కూడా చేశారు. మా కుటుంబంలో నాకంటే ఎన్టీఆర్ ముందుకు వెళ్తున్నాడు అనే ఫీలింగ్ నాకెప్పుడూ లేదు. నేను, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎప్పుడు కలిసినా చాలా సరదాగా మాట్లాడుకుంటారు. ఒకరి సక్సెస్ ని మరొకరం సెలబ్రేట్ చేసుకుంటాము" అని చెప్పారు తారకరత్న.

Web TitleTaraka Ratna Reacts on Disputes With Jr NTR
Next Story