Taraka Ratna: విషమంగానే తారకరత్న ఆరోగ్య పరిస్థితి

Taraka Ratna: నారాయణ హృదయాలయలో తారకరత్నకు చికిత్స

Jyothi
Published on: 29 Jan 2023 9:55 AM IST
Taraka Ratna Health Condition is Serious
X

Taraka Ratna: విషమంగానే తారకరత్న ఆరోగ్య పరిస్థితి

Taraka Ratna: బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో నందమూరి తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. వైద్యనిపుణల నిరంతర పర్యవేక్షణలో వైద్యపరీక్షలు, చికిత్స కొనసాగుతోంది. నందమూరి కుటుంబ సభ్యులందరూ బెంగళూరు చేరుకున్నారు. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ చేరుకోనున్నారు.

తారకరత్నకు అరుదైన వ్యాధి మెలెనా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మెలెనా కారణంగా నోరు, అన్నవాహిక, చిన్న ప్రేగు వద్ద అధికంగా బ్లీడింగ్ అవుతుందని... బ్లీడింగ్ వల్ల చాలా భాగాలకు రక్త ప్రసరణ ఆగిపోయినట్లు వెల్లడించారు. రక్త ప్రసరణ కష్టంగా మారడంతో ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నామని... మెలెనా వల్ల అధిక ఆయాసంతో కుప్పకూలిపోయే లక్షణాలు ఉంటాయని తెలిపారు. తారకరత్నకు షుగర్‌, బీపీ హెచ్చు స్థాయిలో ఉండటంతో చికిత్స కష్టంగా మారుతుందని వైద్యులు వెల్లడించారు.

Jyothi

Jyothi

Next Story