పాయల్ రాజ్ పుత్ పాత్రలో కనిపించనున్న బాలీవుడ్ బ్యూటీ

పాయల్ రాజ్ పుత్ పాత్రలో కనిపించనున్న బాలీవుడ్  బ్యూటీ
x
Highlights

బోల్డ్ సినిమాగా అజయ్ భూపతి దర్శకత్వంలో, కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరోహీరోయిన్లుగా నటించిన 'ఆర్ఎక్స్ 100' సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే....

బోల్డ్ సినిమాగా అజయ్ భూపతి దర్శకత్వంలో, కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరోహీరోయిన్లుగా నటించిన 'ఆర్ఎక్స్ 100' సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. సునీల్ శెట్టి కొడుకు అహాన్ శెట్టి ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం కాబోతున్నాడు. సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో మొదలు కానుంది. మిలాన్ లూథ్రియా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కీలకంగా ఉంటుందని తెలిసిన విషయమే. తెలుగులో పాయల్ రాజ్ పుత్ నటించిన ఈ పాత్రలో హిందీ లో ఎవరు నటించబోతున్నారు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర నిర్మాత సాజిద్ మరియు దర్శకుడు మిలాన్ ఈ చిత్రానికి హీరోయిన్ గా తార సుతారియా ని తీసుకున్నట్లు తెలుస్తోంది. కరణ్ జోహార్ నిర్మిస్తున్న 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం కాబోతున్న ఈ భామ 'మార్జావా' సినిమాలో కూడా నటిస్తోంది. ఇప్పటికే అహాన్ మరియు తారా కలిసి కొన్ని వర్క్షాప్స్ కూడా హాజరైనట్లు తెలుస్తోంది. వారి పాత్రల కోసం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టారు. ఈ సినిమా షూటింగ్ ఈ సంవత్సరం రెండవ హాఫ్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. 2020 మొదట్లో ఈ సినిమా విడుదల కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories