Tammreddy Bharadwaja: టికెట్ ధరలను పెంచటం అసలు సమస్య కాదు అంటున్న తమ్మారెడ్డి

Tammreddy Bharadwaja: టికెట్ ధరల పై ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్న తమ్మారెడ్డి

admin1
Updated on: 6 Jan 2022 1:01 PM IST
Tammareddy Bharadwaja Interesting Comments on AP Ticket Prices | Tollywood News
X

టికెట్ ధరల పై ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్న తమ్మారెడ్డి

Tammreddy Bharadwaja: టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాత మరియు దర్శకుడు అయిన తమ్మారెడ్డి భరద్వాజ్ ఎప్పటికప్పుడు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడి వార్తల్లో ఉంటారు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి మరియు సినిమా టిక్కెట్ల ధరల పెంపుపై తమ్మారెడ్డి కొన్ని షాకింగ్ కామెంట్ చేశారు. అసలు టికెట్ ధర తగ్గించడం పెద్ద సమస్య కాదని దానివల్ల చిన్న సినిమాలకి ఎటువంటి ఇబ్బంది ఉండదని కొట్టిపారేశారు. ప్రజలందరికీ సినిమా టికెట్ ధరలు అందుబాటులో ఉండాలని ఏకైక ఉద్దేశంతోనే ఏపీ ప్రభుత్వం ఇలా చేసిందంటూ సమ్మతి పలికారు.

అయితే పెద్ద సినిమాలకి మాత్రం వేరే ధరలు నిర్ణయించాలని ప్రభుత్వానికి కోరుకుంటే సరిపోతుందని ఆయన సలహా ఇచ్చారు. కానీ అలా చేస్తే కావాలని కొంతమంది మరొకరిపై బురద జల్లుతున్నారు అంటూ వివాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక టిక్కెట్ల ధరల తగ్గింపుపై చిరంజీవి చేసిన కామెంట్స్ లో తప్పేం లేదని అన్నారు. చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల వల్ల ఆయన విసిగిపోయి అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అని అన్న తమ్మారెడ్డి ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్, డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్‌ తదితరులు ముందు టికెట్ ధరలపై స్పందించాలని చెప్పుకొచ్చారు. వాళ్లతో స‌మ‌స్య ప‌రిష్కారం కాన‌ప్పుడు మాత్ర‌మే చిరంజీవి, బాలకృష్ణ, లేదా నాగార్జున, మోహన్‌బాబు వంటి వారు తమ వంతు ప్రయత్నం చేయాలని తమ్మారెడ్డి అనడం గమనార్హం

admin1

admin1

Next Story