"బింబిసార" సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన తమ్మారెడ్డి భరద్వాజ్

Tammareddy Bharadwaja: కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన "బింబిసార" సినిమా ఈ మధ్యనే ఆగస్టు 5, 2022న థియేటర్లలో విడుదలైంది.

Arun Chilukuri
Updated on: 11 Aug 2022 9:15 PM IST
Tammareddy Bharadwaja Comments on Bimbisara Movie
X

"బింబిసార" సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన తమ్మారెడ్డి భరద్వాజ్

Tammareddy Bharadwaja: కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన "బింబిసార" సినిమా ఈ మధ్యనే ఆగస్టు 5, 2022న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంటుంది. కొత్త డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించిన ఈ సినిమాల్లో కేథరిన్ తెరిసా హీరోయిన్ గా నటించింది. అయితే తాజాగా ఈ సినిమాని వీక్షించిన తమ్మారెడ్డి భరద్వాజ్ సినిమా గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

"బింబిసార" రెగ్యులర్ కమర్షియల్ కథే అని అందులో కొత్తగా ఏమీ లేదని అన్నారు తమ్మారెడ్డి. "కానీ కథని దర్శకుడు అర్థవంతంగా తీర్చిదిద్దిన తీరు చాలా బాగుంది. ఒక క్రూరమైన రాజు టైం ట్రావెల్ తర్వాత ఎంత ఎమోషనల్ గా మారిపోయాడు అనే దాన్ని సినిమాలో చాలా చక్కగా ఆవిష్కరించారు. కేవలం టైం ట్రావెల్ కాబట్టి ఆదిత్య 369 సినిమాతో పోల్చటం సరికాదు. ఈ రెండు సినిమాలకి ఎటువంటి సంబంధం లేదు. మంచి కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు సినిమాలని ఆదరిస్తారు. అయితే ఈ విజయాలతో సంబరపడిపోకుండా సినిమా రన్ పెరిగేలా దృష్టి పెడితే బాగుంటుంది" అని అన్నారు తమ్మారెడ్డి.

కనీసం 50 రోజులపాటు కూడా సినిమాలు థియేటర్లలో ఆడటం లేదని అసలు ప్రేక్షకులు థియేటర్లకు రావడం ఎందుకు మానేసారు అనేదానిపై కూడా దృష్టి పెట్టాలని అలా ఆలోచించినప్పుడే మంచి సినిమాలు వస్తాయని థియేటర్లు బ్రతుకుతాయని సినిమాలకు పూర్వవైభవం వస్తుందని స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story