The Family man 2: రిలీజ్‌కు ముందే ఫ్యామిలీ మెన్-2 ప్రకంపనలు

The Family man 2: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఫ్యామిలీ మెన్-2 ట్రైలర్ * సమంత రోల్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తమిళులు

Sandeep Eggoju
Published on: 21 May 2021 6:12 PM IST
Tamils Objection on Samantha Role in The Family Man 2
X
ది ఫామిలీ మ్యాన్ 2 లో సమంత (ఫైల్ ఇమేజ్)

The Family man 2: ఇండియాస్ మోస్ట్ అవెయిటెడ్ వెబ్ సిరీస్ ఫ్యామిలీమెన్-2 రిలీజ్‌కు ముందే ప్రకంపనలు రేపుతోంది. భారీ అంచనాలతో రూపొందిన ఈ సిరీస్ ట్రైలర్‌పై వివాదం రాజుకుంది. మా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ తమిళులు ఆందోళనలు చేపట్టారు. దీంతో అమెజాన్‌ లాంటి దిగ్గజ ఓటీటీకి కూడా దిగిరాక తప్పలేదు. ఇంతకూ ఫ్యామిలీ మాన్ సిరీస్‌కు తమిళులు ఎందుకు అడ్డుచెప్పారు.? సమంత పుట్టి పెరిగిన ప్రాంతం నుంచే ఆ స్టార్‌ హీరోయిన్‌కు ఎందుకు బెదిరింపులు వస్తున్నాయి.? అసలు ఫ్యామిలీ మాన్ సీజన్-2లో అంత వివాదం ఏముంది.?

ఫ్యామిలీ మెన్ సీజన్-2 ట్రైలర్ రిలీజ్ అవ్వగానే తమిళులు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవడం ప్రారంభించారు. ట్రైలర్‌లో సమంతాను ఓ తమిళ సూసైడ్ బాండర్‌గా కనిపించడం.. అందరినీ చంపేస్తానని డైలాగ్స్ కూడా ఉన్నాయి. దానికి తోడు తమిళుల కోసం పోరాడిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలంకి ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నట్లు ట్రైలర్ చూపించారు. దీంతో ట్రైలర్ విడుదలైన దగ్గర నుంచి ఫ్యామిలీ మెన్-2 ఎగైనెస్ట్ తమిళ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది.

మరోవైపు.. శ్రీలంకలో తమిళుల కోసం పోరాడిన ఎల్‌టీటీఈ సంస్థ టెర్రరిస్టు సంస్థ కాదని, సమంత తమిళ నటి అయి ఉండి కూడా.. ఇలాంటి పాత్ర చేయడం ఏంటి అంటూ తమిళ తంబీలు ఫైర్ అయ్యారు. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన అమెజాన్ ప్రైమ్.. ట్రైలర్‌ను రీ ఎడిట్ చేసి విడుదల చేసింది. అయితే.. ట్రైలర్‌తోనే ఈ రేంజ్ తలనొప్పులు మొదలైతే.. ఇక సిరీస్ విడుదలైన తర్వాత ఇంకెన్ని ఇబ్బందులు తలెత్తుతాయో అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ జూన్ 4న స్ట్రీమింగ్ కాబోతోంది. ట్రైలర్‌కే రచ్చ రచ్చ చేసిన తమిళులు.. ఇక సిరీస్‌పై ఎలా రియాక్ట్ అవుతారన్నది హాట్‌టాపిక్‌గా మారింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story