The Family Man 2: 'ది ఫ్యామిలీ మ్యాన్‌ 2' బ్యాన్‌ కానుందా?

The Family Man 2: సమంతా అక్కినేని తొలిసారి నటిస్తున్న ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Venkata Chari
Updated on: 25 May 2021 2:09 PM IST
Tamilnadu Requested to Central Govt Ban or stop The Family Man 2 Series on Amazon Prime Video
X

ది ఫ్యామిలీ మ్యాన్ 2 పోస్టర్లు (ఫొటో ట్విట్టర్)

The Family Man 2: సమంతా అక్కినేని తొలిసారి నటిస్తున్న ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ వెబ్ సిరీస్ ఎట్టకేలకు ట్రైలర్ రిలీజ్ చేసి, జూన 2న అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుందని నిర్మాతలు ప్రకటించారు. ట్రైలర్ విడులతో ఎన్నో సంచనాలు క్రియోట్ చేసింది. సమంతా తొలిసారి డీ గ్లామరస్ పాత్రలో కనిపించడంతోపాటు ఇందులో టెర్రరిస్టుగా నటించింది.

ఎంతో ఆసక్తిని క్రియోట్ చేసిన ఈ వెబ్ సిరస్... అంతే రేంజ్‌లో వివాదాల్లో కూరుకపోయింది. చివరికి ఈ వివాదాలతో ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ విడుదలపైనే నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఈలం తమిళ్స్‌ను నెగిటివ్‌గా చూపించారని, గతంలో బ్యాన్‌ చేసిన డిజిటల్‌ కంటెంట్‌ను ప్రస్తావిస్తూ తమిళులను అభ్యంతరకరంగా చూపించారని తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. విడుదల కాకుండా ఆదేశాలు జారీ చేయాలని కేంద్రాన్ని కోరింది.

ది ఫ్యామిలీమ్యాన్‌ 2లో 'అభ్యంతరకరం, అనవసరంలేని కంటెంట్‌ ఉంద'ని తమిళనాడు ఐటీ శాఖ మంత్రి మనో తంగరాజ్‌ గతంలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు తంగరాజ్‌ ది ప్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌పై ఓ లేఖ రాశాడు. ఈ వెబ్ సిరీస్‌లో ఈలం తమిళ్స్‌ సెంటిమెంట్స్‌తో పాటు తమిళ ప్రజల మనోభావాలను కూడా దెబ్బతీస్తుందని లేఖలో పేర్కొన్నారు. తమిళ నటి సమంతను ఉగ్రవాదిగా చూపించి, తమిళుల ఆత్మగౌరవంపై దాడిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా, ఈ విజ్ఞప్తిని పరిశీలిస్తామని కేంద్ర సమాచార ప్రసార శాఖ పేర్కొన్నట్లు ఆయన తెలిపారు.

మా అభ్యంతరాలను పట్టించుకోకుండా.. ఈ వెబ్ సిరీస్‌ను విడుదల చేస్తే.. తీవ్ర పరిణామాలు ఎదువతాయని ఎండీఎంకే జనరల్‌ సెక్రటరీ వైకో కూడా ప్రకాశ్‌ జవదేరకర్‌కు మరో లేఖ రాశారు. తమిళ ప్రజలను అవమానపరిచేలా ఎవరు ప్రవర్తించినా ఊరుకోబోమని హెచ్చరించారు.

దీంతో ఈ వెబ్ సిరీస్‌ విడుదలపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఈ మేరకు ట్విట్టర్లో #FamilyMan2_against_Tamils, #Banfamilyman2 హ్యాష్ ట్యాగ్‌లతో ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు విడుదల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నామని మరికొంత మంది ట్వీట్లు చేస్తున్నారు. కాగా, రీ ఎడిట్ చేసిన మరో ట్రైలర్‌ను అమెజాన్ విడుదల చేసింది. చూడాలి మరి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ విడుదల చేయాల్సి వస్తే.. తమిళ్ ఈలం, ఐఎస్‌ఐ ఉగ్రవాద సంస్థతో వచ్చే సీన్లకు కత్తెర పడే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, రాజ్‌ అండ్‌ డీకే డైరెక్ట్‌ చేసిన ఈ వెబ్‌ సిరీలో సమంతతో పాటు మనోజ్‌ వాజ్‌పాయి, ప్రియమణి తదితరులు నటించారు. స్లీపర్‌ సెల్స్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఫ్యామిలీమ్యాన్‌ 2 ట్రైలర్‌తోనే కాంట్రవర్సీని క్రియోట్ చేసిన సంగతి తెలిసిందే. మొదటి సిరీస్‌లో ఇలాంటి సీన్స్ ఉన్నా... విడుదలై.. బాగానే ఆకట్టుకుంది. ప్రస్తుతం సమంతా ఉగ్రవాదిగా నటించడంతో క్రాంట్రవర్సీలు మొదలైనట్లు మాట్లాడుకుంటున్నారు. దేశ వాప్తంగా ది ఫ్యామిటీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ విడుదలపై ఆసక్తి నెలకొంది.

Venkata Chari

Venkata Chari

Next Story