Leo Movie: విజయ్ 'లియో'కు భారీ షాక్.. విడుదలైన కొద్ది గంటల్లోనే ఆన్‌లైన్‌లో..!

Leo Movie: విజయ్ 'లియో'కు భారీ షాక్.. విడుదలైన కొద్ది గంటల్లోనే ఆన్‌లైన్‌లో..!

Jyothi
Published on: 19 Oct 2023 2:27 PM IST
Tamil Star Hero Vijay Latest Movie Leo Leaked online
X

Leo Movie: విజయ్ 'లియో'కు భారీ షాక్.. విడుదలైన కొద్ది గంటల్లోనే ఆన్‌లైన్‌లో..!

Leo Movie: స్టార్ హీరో విజయ్ తాజా చిత్రం లియో గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. కాగా, ఈ సినిమా విడుదలపై వివాదం తలెత్తింది. ఈసినిమా విడుదలైన రోజే సినిమా యూనిట్‌కి భారీ షాకింగ్ న్యూస్ వచ్చింది. 'లియో' విడుదలైన కొద్ది గంట‌ల్లోనే ఆన్‌లైన్‌‌లో వెబ్‌సైట్లలో కనిపించింది. అది కూడా హెచ్‌డీ ప్రింట్ కావడంతో విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా పైర‌సీ వెబ్‌సైట్స్‌లో దర్శనమివ్వడంతో సినిమా యూనిట్ ఆందోళనలో పడిపోయారు. కాగా, లియో ప్రింట్‌ను పైరసీ వెబ్‌సైట్‌ నుంచి తీసేసేందుకు సినిమా యూనిట్ సత్వర చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ లీకైన‌ హెచ్‌డీ ప్రింట్‌పై సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో వచ్చిన మాస్టర్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరోసారి వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'లియో'. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజగా నేడు ఈ సినిమా థియేటర్లలోకి విడుదలైంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్‌ నటుడు సంజ‌య్‌ద‌త్‌, అర్జున్ కీల‌క పాత్ర‌లు పోషించారు. కాగా, లియో సినిమాను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ తెలుగులో విడుదల చేసింది.

Jyothi

Jyothi

Next Story