Samantha: సమంత సినిమాకి పోటీగా తమిళ్ సినిమాలు..

* సమంత సినిమాకి అడ్డంకులు గా మారిన డబ్బింగ్ సినిమాలు

Dhatripriya
Updated on: 1 March 2023 9:31 PM IST
Tamil Movies Compete With Samantha Movie
X

సమంత సినిమా కి పోటీగా తమిళ్ సినిమాలు..

Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా "శాకుంతలం". ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరిలోనే విడుదల కావాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల ఏప్రిల్ కి వాయిదా పడింది. ఈ సినిమా ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదల కాబోతోంది అని చిత్ర బృందం ఈ మధ్యనే ప్రకటించింది.

మణిరత్నం దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న "పొన్నియిన్ సెల్వన్" ఏప్రిల్ ఆఖరిలోనే విడుదలకి సిద్ధమవుతోంది. ఈ సినిమాతో క్లాష్ అవ్వకుండా "శాకుంతలం" దర్శక నిర్మాతలు తమ సినిమాని రెండు వారాల ముందే విడుదల కి ప్లాన్ చేస్తున్నారు. కానీ త్వరలో విడుదల కాబోతున్న 2 తమిళ్ సినిమాలు శాకుంతలం సినిమాకి గట్టి కాంపిటీషన్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. అందులో మొదటిది "రుద్రుడు".

రాఘవ లారెన్స్ హీరోగా "కాంచన" వంటి సూపర్ హిట్ సిరీస్ ఫ్రాంచైస్ కి సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హారర్ కామెడీ "రుద్రుడు". మరోవైపు విజయ్ ఆంటోనీ సూపర్ హిట్ సినిమా బిచ్చగాడు సినిమాకి సీక్వెల్ అయిన "బిచ్చగాడు 2" కూడా ఏప్రిల్ 14 న విడుదల కాబోతోంది. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ రెండు సినిమాలు నిజంగానే శాకుంతలం సినిమా కలెక్షన్లపై ఎఫెక్ట్ చూపిస్తాయా లేదా అనేది ఇంకా వేచి చూడాల్సి ఉంది. మరోవైపు నిఖిల్ "స్పై" సినిమా కూడా ఏప్రిల్ 14న విడుదల కావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

Dhatripriya

Dhatripriya

Next Story