పవన్ దారిలోనే నడవనున్న తమిళ హీరో విజయ్

Movie News: మెగాస్టార్ తర్వాత పవర్ స్టార్ ఇలా ఇద్దరూ రాజకీయాల్లోకి వచ్చారు.

Arun Chilukuri
Published on: 14 July 2023 7:21 PM IST
Tamil Hero Vijay to Take Pawan Kalyan Path
X

పవన్ దారిలోనే నడవనున్న తమిళ హీరో విజయ్

Movie News: మెగాస్టార్ తర్వాత పవర్ స్టార్ ఇలా ఇద్దరూ రాజకీయాల్లోకి వచ్చారు. పవన్ మాత్రమే ఇంకా జర్నీ కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా పవన్ దారిలోనే కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి రంగంలోకి దిగుతున్నాడని అంటున్నారు.

టాలీవుడ్ లో ఎన్టీఆర్ తర్వాత పొలిటికల్ ఎంట్రీతో ఓ ప్రభంజనమే స్రుష్టించే ప్రయత్నం చేసిన హీరో మెగాస్టార్ చిరు. కాని తనకి రాజకీయాలు అచ్చిరాలేదు. నప్పలేదు. ఏదేమైనా మళ్లీ సినిమాల్లోకి రావటంతో అభిమానుల ఆనందానికి హద్దులులేవు. చిరు తర్వాత మెగా కాంపౌండ్ నుంచి పాలిటిక్స్ లోకి అడుగులేసింది పవర్ స్టారే. జనసేన అని పార్టీ పెట్టాడు. మధ్యలో చిరులానే గ్యాప్ తీసుకోబోయాడు. మళ్లీ మనసు మార్చుకుని అటు రాజకీయాలు, ఇటు సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నాడు.

కోలీవుడ్ స్టార్ విజయ్ పొలిటికల్ ఎంట్రీ అనగానే, వెంటనే సీన్లోకి పవన్ కళ్యాణ్ పేరొస్తోంది. పవర్ స్టార్ తో పోలికలు పెట్టేస్తున్నారు. అన్నీంట్లో పవన్ ని ఫాలో అయ్యే విజయ్ కి, ఇప్పుడు రాజీకీయాల్లో కూడా పవనే ప్రేరణ అంటున్నారు. అందుకే విజయ్ కుడా పవన్ లానే సినిమాలు, రాజకీయలు పార్ లల్ గా ప్లాన్ చేసుకుంటున్నాడట.

టాలీవుడ్ హీరోల్లానే కోలీవుడ్ హీరోల్లో కూడా పొలిటికల్ జర్నీ ఇంట్రస్టింగ్ గా సాగుతోంది. తమిళ దళపతి విజయ్ కూడా లియో మూవీ పూర్తి చేసి, అది రిలీజ్ అయ్యేలోపే తమిళ నాడు అంతటా పాద యాత్ర చేయాలనుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. పొలిటికల్ ఎంట్రీ ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయ్యిందనే మాటే వినిపిస్తోంది.

నిజానికి విజయ్ దళపతి రెండే ళ్ల క్రితమే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. అదే విషయం తన తండ్రి లీక్ చేయటం, తర్వాత తన సినిమాలు ఫ్లాప్ అవటంతో, సరైన టైం కాదని, ఇంతకాలం వేచి చూశాడట. ఏదేమైనా ఇప్పుడు దసరా తర్వాత రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నాడట.

లియో దసరాకే రిలీజ్ కాబోతోంది. తర్వాత వెంకట్ ప్రభు మేకింగ్ లో మరో మూవీ రానుంది. ఆతర్వాత శంకర్ మేకింగ్ లో పొలిటికల్ డ్రామా చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. అది 2024 కి తమిళ నాడులో జరిగే ఎన్నికలకు ముందే రిలీజ్ అయ్యేలా శంకర్ ని ప్లాన్ చేయమన్నట్టు ప్రచారం జరుగుతోంది.

హీరో రాజకీయాల్లోకి వస్తే, తన సినిమాల్లో ఏ డైలాగ్ పేలినా, దాని వెనక రాజకీయ నేపథ్యం ఉండటమో, అలా అనుకోవటమో కామన్. ఇప్పుడు విజయ్ రాజకీయాల్లో కి వస్తూనే, పొలిటికల్ మైలేజ్ కోసం, ప్రమోషన్ కోసం సినిమాలు కంటిన్యూ చేస్తాడనే ప్రచారం జరుగుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story