ప్రముఖ నటి, బిగ్‏బాస్ కంటెస్టెంట్ అరెస్ట్

* తమిళ సినీ పరిశ్రమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియో * నీరవ్ మిథున్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు 7 సెక్షన్ల కింద కేసులు

Sandeep Reddy
Updated on: 14 Aug 2021 7:39 PM IST
Tamil Actress And Bigg Boss Contestant Meera Mitun Arrested
X

బిగ్ బాస్ (ట్విట్టర్ ఫోటో)

Meera Mitun Arrest: గత కొద్ది రోజులుగా తన ఇష్టానుసారం సామాజిక వర్గాలపై సినీ ప్రముఖుల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న తమిళ నటి బిగ్‏బాస్ మాజీ కంటెస్టెంట్ మీరా మిథున్ అరెస్ట్ అయ్యింది. దళితులను కించపరుస్తూ తమిళ నటి, బిగ్‏బాస్ కంటెస్టెంట్ మీరా మిథున్ అరెస్ట్తమిళ సినీ పరిశ్రమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆమె చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వగా కేరళలో తలదాచుకున్న మీరా మీథున్‏ను ఈరోజు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.


దళితులపై అనుచిత వ్యాఖ్యలకుగానూ నీరవ్ మిథున్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు మరో 7 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. విచారణకు హాజరుకావాల్సిందిగా చెన్నై పోలీసులు నోటీసులు జారీచేశారు. అయితే మీరా అదేం పట్టనట్లుగా పోలీసులు పంపిన నోటీసులను బేఖాతరు చేసింది. మీరాను అరెస్ట్ చేయాలంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో తనను పోలీసులు అరెస్ట్ చేయడం జరగదని కేవలం కలలో మాత్రమే అరెస్ట్ చేయగలరు. ఒకవేళ సాధ్యమైతే తనను ధైర్యంగా అరెస్ట్ చేసుకోవచ్చని పోలీసులకు సవాల్ విసిరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేరళలో తలదాచుకున్న మీరా మిథున్‏ను అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెను చెన్నైకి తీసుకువస్తున్నట్లుగా తెలుస్తోంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story