Tamil Actor: గుండెపోటుతో ఆసుప‌త్రిలో చేరిన టాప్ కమెడియన్.. పరిస్థితి విష‌మం..!

Tamil Actor: తమిళ హాస్య నటుడు వివేక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Arun Chilukuri
Published on: 16 April 2021 3:41 PM IST
Tamil Actor Vivek in ICU After Heart-Attack
X

Tamil Actor: గుండెపోటుతో ఆసుప‌త్రిలో చేరిన టాప్ కమెడియన్.. పరిస్థితి విష‌మం..!

Tamil Actor: తమిళ హాస్య నటుడు వివేక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేయించుకున్న వివేక్ కు ఇవాళ గుండెనొప్పి వచ్చింది దాంతో ఆయన్నుకుటుంబం వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ పై వైద్యం అందిస్తున్నారు. అయినప్పటికీ పరిస్థితి విషమంగానే ఉందని తెలుస్తోంది.

తమిళ ఇండ‌స్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ యాక్ట‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వివేక్ దాదాపు 220 సినిమాలు చేశాడు. ఇత‌నికి 2009లో ప‌ద్మ‌శ్రీ అవార్డ్ కూడా ద‌క్కింది. వివేక్ త‌మిళ నటుడు అయిన ఆయ‌న న‌టించిన ప‌లు సినిమాలు తెలుగులో విడుద‌ల కావ‌డం వ‌ల‌న అత‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా చాలా సుప‌రిచితం. ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్ హాస‌న్, విజ‌య్, విశాల్ వంటి స్టార్ హీరోల‌తో క‌లిసి ప‌ని చేసిన వివేక్ త‌మిళంలో టాప్ క‌మెడీయన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

వాస్తవానికి కరోనా వ్యాక్సిన్ పై అవగాహన కల్పించడానికి, ప్రజల్లో ఉన్న భయాలను పోగొట్టడానికి ఆయన ప్రభుత్వాసుపత్రిలో టీకా వేయించుకున్నారు. వ్యాక్సినేషన్ కు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపధ్యంలో ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించడానికి ఆయన స్వయంగా రంగంలోకి దిగి టీకా వేయించుకున్నారు. వ్యాక్సిన వేయించుకుంటే ప్రాణభయం ఉండదని, కాబట్టి ప్రజలందరూ త్వరగా టీకా వేయించుకోవాలని వివేక్ సోషల్ మీడియా వేదికగా సందేశం కూడా ఇచ్చారు. సోషల్ రెస్పాన్సిబిలిటీతో ప్రవర్తించే అతికొద్ది మంది నటుల్లో వివేక్ ఒకరు. 1990 నుంచి తమిళ ఇండస్ట్రీలో వివేక్ తనదైన ముద్ర కనపరుస్తూవచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story