నటి చిత్రను ఆమె పోషించిన పాత్రే చంపించిందా?

నటి చిత్రను ఆమె పోషించిన పాత్రే చంపించిందా?
x
Highlights

తమిళనాట సంచలనం సృష్టించిన టీవీ నటి విజె చిత్ర ఆత్మహత్యకు కారణాలేంటి..? ఆమెకు కాబోయే భర్తే చిత్ర మరణానికి కారకుడయ్యాడా..? చిత్ర ఆత్మహత్యకు పాల్పడిన ఆరు...

తమిళనాట సంచలనం సృష్టించిన టీవీ నటి విజె చిత్ర ఆత్మహత్యకు కారణాలేంటి..? ఆమెకు కాబోయే భర్తే చిత్ర మరణానికి కారకుడయ్యాడా..? చిత్ర ఆత్మహత్యకు పాల్పడిన ఆరు రోజుల తర్వాత పోలీసులు సాధించిన పురోగతి ఏంటి..? అసలు పోస్టుమార్టం నివేదికలో ఎలాంటి నిజాలు వెలుగులోకొచ్చాయి..? ఆ రోజు రాత్రి చిత్ర షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత అసలేం జరిగింది..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కోసమే చిత్రకు కాబోయే భర్త హేమంత్ కుమార్ ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు.

విజె చిత్ర చనిపోయిన ఆరు రోజుల తర్వాత పోలీసులు హేమంత్ కుమార్‌ని అదుపులోకి తీసుకున్నారు. హోటల్లో చిత్ర అనుమానాస్పద మృతి అనంతరం కేసు నమోదు చేసుకుని ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టంకి తరలించిన పోలీసులు ఆమె పోస్ట్ మార్టం నివేదికను పరిశీలించారు. చిత్ర పోస్ట్ మార్టం నివేదిక ఆమెది ఆత్మహత్య అనే చెబుతున్నప్పటికీ.. చిత్ర తల్లి మాత్రం తన కూతురిది సహజ మరణం కాదని, ఆమె మృతి వెనుక అదే రోజు రాత్రి ఆమెతో హోటల్లో బస చేసిన హేమంత్ ఉన్నాడని ఆరోపించారు.

మరోవైపు తన కూతురుతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న హేమంత్ కుమార్ ఆ తర్వాత ఆమెను వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడని చిత్ర తల్లి ఆరోపించారు. ఆర్థికపరమైన అంశాలే హేమంత్ వేధింపులకు ఓ కారణమై ఉండొచ్చని ఆమె అనుమానం వ్యాక్తం చేశారు. ఈ క్రమంలో చిత్ర తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు హేమంత్‌ని అదుపులోకి తీసుకున్నారు. అటు చిత్ర ఆత్మహత్య కేసులో విచారణ వేగవంతం చేసిన పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. పాండియన్ స్టోర్స్ టీవీ సీరియల్‌లో చిత్ర పోషిస్తున్న పాత్ర తీరుతెన్నులు, ఆమె మరొకరితో సన్నిహితంగా మెదిలినట్టు నటించడం వంటి అంశాలు హేమంత్‌ని అసంతృప్తికి గురిచేసినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం విజే చిత్ర విషయంలో హేమంత్‌లో ఉన్న ఆ అసంతృప్తే ఆమె ఆత్మహత్యకు కారణమైందా ? విజే చిత్ర ఆత్మహత్యకు అతడే కారణమా? అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రస్తుతానికి వీజే చిత్రం మృతికి అసలు కారణాలు ఏంటనేది మాత్రం ఇంకా తెలియరాకపోవడంతో చిత్ర మృతి ఇంకా ఓ అంతుచిక్కని మిస్టరీగానే మిగిలింది.

Show Full Article
Print Article
Next Story
More Stories