Tamannaah: '11th Hour' విడుదలయ్యేది ఆ రోజే

Tamannaah: తాజాగా ఆహా వెబ్ సిరీస్‌లో రూపొందించడంలో స్పీడ్ పెంచింది. ఆహా టీమ్ టాలీవుడ్ టాప్ హీరోయిన్ తమన్నా ప్రధాన పాత్రలో ఓ ప్రాజెక్ట్‌ను అధికారికంగా అనౌన్స్ చేసింది.

Samba Siva Rao
Updated on: 23 March 2021 8:01 PM IST
11th Hour
X

‘11th అవర్‌’ రిలీజ్ డేట్ ఫిక్స్

Tamannaah: ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సూపర్ హిట్ సినిమాలు, వరుస షోలతో దుసూకుపోతున్న విషయం తెలిసిందే. కాక్ర్, నాంది, గాలిసంపత్ , జాంబిరెడ్డి వంటి సూపర్ హిట్ చిత్రాల డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసి దూసుకుపోతుంది. ఇటీవటే టాలీవుడ్ అగ్రకథానాయక సమంత‌తో సామ్ జామ్ షో ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. ఆ షో విజయవంతం కావడంతో రానా హోస్ట్‌గా చేసిన నెంబర్ వన్ యారీ మూడో సిజన్ డిజిటల్ రైట్స్ కోనుగోలు చేసింది. తాజాగా ఆహా వెబ్ సిరీస్‌లో రూపొందించడంలో స్పీడ్ పెంచింది. ఆహా టీమ్ టాలీవుడ్ టాప్ హీరోయిన్ తమన్నా ప్రధాన పాత్రలో ఓ ప్రాజెక్ట్‌ను అధికారికంగా అనౌన్స్ చేసింది.

ఈ నేపథ్యంలో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న వెబ్‌ సిరీస్‌ '11th అవర్‌'. థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ వెబ్‌ సిరీస్‌ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించడంతో ఈ సిరీస్ ఆసక్తి నెలకొంది. తమన్నా మొదటి సారి వెబ్ సిరీస్ లో నటించింది. ఏప్రిల్‌ 9వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది. థ్రిల్లర్‌ జోనర్‌ వెబ్ సిరీస్ లను ప్రేక్షకులు ఇష్టపడడంతో ఓటీటీ అన్ని ఆ మార్గంలో సిరీస్ ప్లాన్ చేస్తున్నాయి. టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఓ వెబ్ సిరిస్ లో నటించిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌లో తాను విన్న తొలి కథ '11th అవర్‌' అని అన్నారు. ప్రవీణ్‌ సత్తార్‌ ఈ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించిన విధానం చాలా కొత్తగా ఉంటుందని చెప్పుకొచ్చారు. విన్న వెంటనే తనకు కథ బాగా నచ్చిందని, అన్ని రకాలుగా మహిళలను బలపేతం చేసేలా ఇందులోని తన పాత్ర ఉంటుందన్నారు. మంచి కథ, స్క్రీన్‌ప్లేతో వస్తున్న '11th అవర్‌' అందరినీ తప్పకుండా అలరిస్తుందని తమన్నా చెప్పారు. తెలుగు సినిమాల్లో ఇలాంటి కంటెంట్‌తో ఇప్పటివరకూ సినిమా రాలేదని అన్నారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story