Tamannaah: నితిన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న తమన్నా

* ఈ మధ్యనే "రంగ్ దే"తో ప్రేక్షకులను అలరించిన నితిన్ తాజాగా ఇప్పుడు "మేస్ట్రో" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

admin1
Updated on: 15 Sept 2021 2:32 PM IST
Tamannaah Showering Praise on Nithiin in Maestro Movie Pre Release Event
X

నితిన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న తమన్నా (ఫైల్ ఫోటో)

Tamannaah: ఈ మధ్యనే "రంగ్ దే" సినిమాతో ప్రేక్షకులను అలరించిన నితిన్ తాజాగా ఇప్పుడు "మేస్ట్రో" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన "అంధాధున్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 17 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కాబోతోంది. విడుదల తేది దగ్గర పడటంతో ప్రమోషన్ల జోరు మరింత పెంచింది చిత్ర బృందం. ఈ నేపథ్యంలో తమన్నా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ, నిజమైన ప్రేమ ఒక మనిషికి రెక్కలు అందిస్తుందని, తనపై తన అభిమానులు చూపించే ప్రేమ అలాంటిదే అని చెప్పుకొచ్చింది.

ఇక రెగ్యులర్ ప్రేమ కథ చుట్టూ తిరగకుండా ఇలాంటి భిన్నమైన స్క్రిప్టు ఎంచుకోవడం, అందులోనూ ఒక గుడ్డివాడి పాత్రలో కనిపించడం నితిన్ గొప్పతనం అని, ఇలాంటి రిస్క్ మరే హీరో తీసుకోలేదు అని కొనియాడారు తమన్నా. అలాగే తనకి ఎప్పటినుంచి నితిన్ తో ఒక కామెడీ కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమా చేయాలని ఉందని కానీ ఇలాంటి ఆర్టిస్టిక్ సినిమాలో కనిపించటం మరింత ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. నితిన్ మరియు నభ కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించారు అని అన్నారు తమన్నా. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించారు.

admin1

admin1

Next Story