తమన్నాతో కోహ్లీకి ఏం పని.. అసలు అక్కడ కూర్చుంది కోహ్లియేనా?

Tamannaah Photos
x

Tamannaah Source Insta

Highlights

Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలిసిందే.

Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలిసిందే. ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్ అభిమానులతో షేర్ చేసుకుంటారు. అయితే తాజాగా తమన్నా "బ్రేక్‌ఫాస్ట్‌ ప్లీజ్‌" అంటూ ఓ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇందులో తమన్నా చేతిలో చిప్స్‌, బిస్కెట్లు ప్యాకెట్లు పట్టుకుని ఉండగా.. వెనక నుంచి ఇద్దరూ వాటినే తదేకంగా చూస్తున్నారు. తమన్నా ముంబై నుంచి హైదరాబాద్‌కు చార్టెడ్‌ ఫ్లైట్‌లో వస్తుండగా తీసిన ఈ ఫొటో మొత్తానికి నెట్టింట తెగ హల్‌చల్‌ చేసింది.

తమన్నా వెనక సీట్లో నుంచి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్రేక్‌ఫాస్ట్‌నే గమనిస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. ఈ ఫొటో చూసిన నెటిజన్లు విరాట్‌ అక్కడెందుకున్నాడని ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు అతడు కోహ్లియేనా? కాదా? అంటూ గందరగోళానికి గురయ్యారు. కానీ అక్కడుంది టీమిండియా కెప్టెన్‌ కాదు. ఆమె హెయిర్‌ డ్రెస్సర్‌, మేకప్‌ ఆర్టిస్ట్‌లు మాత్రమే తనతో ఉన్నారని ఫోటో క్యాప్షన్‌లో చెప్పకనే చెప్పింది. కాగా 2012లో తమన్నా, విరాట్‌ ఇద్దరూ ఓ యాడ్‌లో కలిసి నటించారు.

మిల్కీ బ్యూటీ తమన్నా లాక్‌డౌన్‌లో ఓటీటీ మీద కూడా ఓ కన్నేసిన విషయం తెలిసిందే. తమన్నా నటించిన '11th అవర్‌' వెబ్‌ సిరీస్‌ ఏప్రిల్ 9 నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. తమన్నా నటించిన 'సీటీమార్‌', 'మాస్ట్రో', 'ఎఫ్‌ 3', 'గుర్తుందా శీతాకాలం', 'నవంబర్‌ స్టోరీస్‌'సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో బీజీగా ఉన్నాడు.Show Full Article
Print Article
Next Story
More Stories