Tamannaah: పెళ్లి పుకార్లపై రియాక్ట్ అయిన తమన్నా

Tamannaah: తన కాబోయే భర్త ఇతనే అంటున్న తమన్నా

Jyothi
Published on: 18 Nov 2022 8:37 AM IST
Tamannaah Reacts To her Marriage Rumours
X

Tamannaah: పెళ్లి పుకార్లపై రియాక్ట్ అయిన తమన్నా

Tamannaah: తాజాగా మీడియా ముఖంగా మాట్లాడుతూ తన పెళ్లిపై వచ్చిన పుకార్లపై మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా స్పందించింది. తమన్నా త్వరలో ఒక బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకోబోతోంది అని ఇప్పటికే చాలా వార్తలు వినిపించాయి. అయితే దానికి రెస్పాన్స్ ఇస్తున్నట్లుగా తమన్నా తన వీడియోను పోస్ట్ చేసింది. ఒక చిన్న వీడియో క్లిప్‌లో, తమన్నా పొట్టి జుట్టు మరియు మీసాలతో ఒక అబ్బాయి లాగా దుస్తులు ధరించింది. తెల్లటి టీ-షర్ట్, ఆకుపచ్చ జాకెట్, మరియు తెలుపు షూస్ ధరించిన తమన్నా వీడియో లో సీక్రెట్ గా గదిలోకి ప్రవేశించి తలుపు మూస్తుంది. "నా వ్యాపారవేత్త భర్తను పరిచయం చేస్తున్నాను" అంటూ నవ్వుతున్న ఇమోజీలు పెట్టింది.

"తమన్నా పెళ్లి పుకార్లు అందరూ నా జీవితాన్ని ఒక సినిమా స్క్రిప్ట్ చేస్తున్నారు" అంటూ హ్యాష్‌ట్యాగ్‌లను కూడా పెట్టేసింది తమన్నా. ఇక పెళ్లెప్పుడు అనే ప్రశ్న కి సమాధానం ఇస్తూ, "నేను ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఆలోచనలో లేను. ప్రస్తుతం నా కెరీర్ చాలా బాగా సాగుతోంది. నేను ఇప్పుడు కేవలం నా కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నాను," అని జవాబిచ్చింది. మధుర్ భండార్కర్ దర్శకత్వం లో "బబ్లీ బౌన్సర్‌" సినిమాతో తమన్నా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా శశాంక ఘోష్ దర్శకత్వం వహించిన "ప్లాన్ ఎ ప్లాన్ బి" లో కూడా తమన్నా మెప్పించింది. ఈ సినిమా సెప్టెంబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది.

Jyothi

Jyothi

Next Story