Tamannaah: మీసం పెట్టుకుని తమన్నా వీడియో.. నెట్టింట్లో వైరల్

Tamannaah: టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నాకు.. చలాకీతనం గురించి ఆమె అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Samba Siva Rao
Updated on: 27 March 2021 3:56 PM IST
tamannaah
X

తమన్నా ఫైల్ ఫోటో 

Tamannaah: టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా చలాకీతనం గురించి ఆమె అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్నేళ్లా‌లో త‌మ‌న్నా అంటే ముందుగా గుర్తొచ్చేది మిల్కీ అందాలే. కాగా.. తమన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఎప్పుడూ మేకప్‌తోనే కనిపించే ఈ అందం ఒక్కోసారి మేకప్ లేకుండా కూడా కనిపించి ఆశ్చర్యపరిచింది. అయితే తాజాగా తమన్నా మరో వీడియోతో అభిమానులను పలకరించింది.

మిల్కీ బ్యూటీ షూటింగ్‌ సెట్‌లో సరదాగా ఖాళీ సమయంలో తీసుకున్న ఓ ఫన్నీ వీడియోతో ఇన్‌స్టాగ్రామ్‌లో సందడి చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో మూతికి మీసం పెట్టుకుని తమన్నా సర్‌ప్రైజ్‌ చేసింది. ఏకంగా ఆ వీడియో తమన్నా పాట పాడుతూ కనిపించింది. ఇప్పుడా వీడియో నెట్టింటా నవ్వులు పూయిస్తోంది. దీనికి 'టాకింగ్‌ మాణిక్కం, వాకింగ్‌ మాణిక్కం, సింగింగ్‌ మాణిక్కం' అంటూ సరదాగా షేర్‌ చేసింది ఆమె.

ఇది చూసిన ఆమె ఫాలోవర్స్‌, అభిమానులు తమన్నాకు ఫిదా అవుతూ కామెంట్స్‌ చేస్తున్నారు. 'వావ్‌ తమన్నా ఎంత ముద్దుగా ఉందో', 'మీసంతో అచ్చం మిక్కిమౌజ్‌లా ఉంది', అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. తమన్నా వరుస సినిమాతో బీజీగా ఉంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటిస్తున్న 'ఎఫ్ 3' సినిమాలో తమన్నా నటిస్తోంది.. ఈ మూవీతో పాటు 'సత్యదేవ్','గుర్తుందా శీతాకాలం' సినిమాలతో బీజీగా గడుపుతుంది. 11th అవర్ అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది. ఖాళీ దొరికనప్పుడల్లా ఇలా సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను పలకరిస్తుంటుంది.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story