Tamannaah: భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న తమన్నా

* సీనియర్ హీరోల కోసం రెమ్యునరేషన్ పెంచేసిన హీరోయిన్ తమన్నా

admin1
Updated on: 16 Oct 2021 2:30 PM IST
Tamannaah Hikes her Remuneration For Upcoming Senior Hero Movies
X

భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న తమన్నా (ట్విట్టర్ ఫోటో)

Tamannaah: ఇండస్ట్రీలో అడుగు పెట్టి 15 ఏళ్ళు దాటినప్పటికీ ఇంకా చేతినిండా ఆఫర్లతో బిజీగా ఉన్న హీరోయిన్ తమన్నా. ఒకవైపు కమర్షియల్ సినిమాలలో హీరోయిన్ గా మరోవైపు స్టార్ హీరోల సినిమాలలో ఐటెం నెంబర్ గా కూడా చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది తమన్నా. చేతిలో బోలెడు ప్రాజెక్టులు ఉన్న తమన్నా టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరు. ఆమె సినిమాకి ఒకటి నుండి ఒకటిన్నర కోటి దాకా తీసుకుంటుంది. అయితే తాజా గా తమన్నా తన రెమ్యునరేషన్ ను పెంచుకోవడం కోసం కొన్ని ట్రిక్స్ నేర్చుకుందట.

ఈ నేపథ్యంలోనే వెంకటేష్, నాగార్జున, చిరంజీవి వంటి సీనియర్ హీరోల సరసన నటించడానికి సిద్ధం అవుతోందట. 60 ఏళ్లు పైబడిన హీరోలతో నటించడానికి నిర్మాతలు హీరోయిన్ కి భారీ రెమ్యునరేషన్ ఇస్తారు. ఈ నేపథ్యంలోనే తమన్నా సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తూ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుంది అని టాక్. ఒకవైపు వెంకటేష్ సరసన "ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్" సినిమా సీక్వెల్ గా తెరకెక్కనున్న "ఎఫ్ 3" సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న తమన్నా మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సరసన మెహర్ రమేష్ దర్శకత్వంలో "భోళా శంకర్" సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది.

admin1

admin1

Next Story