"గుర్తుందా శీతాకాలం" నిర్మాతలకి షాక్ ఇచ్చిన తమన్నా

Tamannaah Gave a Shock to The Makers of Gurtunda Vinthamam.
x

"గుర్తుందా శీతాకాలం" నిర్మాతలకి షాక్ ఇచ్చిన తమన్నా

Highlights

Tamannaah Bhatiya: "గుర్తుందా శీతాకాలం" ప్రమోషన్స్ కి దూరంగా ఉండనున్న తమన్నా

Tamannaah Bhatiya: ఎప్పుడూ తన సినిమా ప్రమోషన్స్లో చాలా యాక్టివ్గా పాల్గొనే తమన్నా భాటియా ఈ మధ్యకాలంలో తన సినిమాల ప్రమోషన్స్ లో కనిపించడం లేదు. గతంలో "ఎఫ్ 3" సినిమా రిలీజ్ సమయంలో కూడా కొన్ని ప్రెస్ మీట్లకి రాకుండా తమన్నా మీడియాని అవాయిడ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక అనిల్ రావిపూడి కి మరియు తమన్నాకి మధ్య జరిగిన గొడవల కారణంగానే తమన్న సినిమా ప్రమోషన్స్ కి రావడం లేదు అంటూ పలు పుకార్లు కూడా వినిపించాయి.

అనిల్ రావిపూడి కూడా ఈ పుకార్లపై పలుసార్లు స్పందించారు. ఇక మరోవైపు తమన్నా కెరియర్ కి ఫుల్ స్టాప్ పడిపోతున్నాయి అనుకున్న సమయంలో ఈమె పై వస్తున్న పుకార్లు అభిమానులను మరింత నిరాశ పరుస్తున్నాయి. తాజాగా తమన్నా ఇప్పుడు "గుర్తుందా శీతాకాలం" అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కన్నడలో సూపర్ హిట్ అయిన "లవ్ మాక్ టైల్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కనుంది.

ఈ సినిమా నిర్మాణ పనులు 2020 లోనే పూర్తయిపోయాయి. వచ్చే నెల 9వ తేదీన సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లు కూడా మొదలుపెడదామనుకుంటున్న సమయంలో తమన్నా మాత్రం ప్రమోషన్స్ లో కనిపించే అవకాశాలు లేవని కొందరు చెబుతున్నారు. దీనికి కారణం ప్రమోషన్స్ కి రావడానికి తమన్నా ఏకంగా ఒకటిన్నర కోట్లు డిమాండ్ చేయడం అని కొందరు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories