Tamannah: వెబ్‌ సిరీస్‌లతో ఆకట్టుకోని మిల్కీ బ్యూటీ; రెండో పరాజయంతో ఢీలా

Tamannaah:'లెవన్త్ అవర్' అనే వెబ్ సిరీస్‌తో ఇటీవల తన తొలి వెబ్ సిరీస్ తో సందడి చేసింది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.

Venkata Chari
Published on: 21 May 2021 4:47 PM IST
Tamannaah Bhatia Tastes Another Flop on OTT Space
X

తమన్నా భాటియా (ఫొటో ట్విట్టర్)

Tamannaah Bhatia: 'లెవన్త్ అవర్' అనే వెబ్ సిరీస్‌తో ఇటీవల తన తొలి వెబ్ సిరీస్ తో సందడి చేసింది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. తాజాగా గురువారం (మే 20న) తన రెండో వెబ్ సిరీస్ 'నవంబర్ స్టోరీ' విడుదలైంది. అయితే, ప్రతికూల సమీక్షలతో రెండో పరాజయం చవిచూసింది ఈ హ్యాపీ డేస్ బ్యూటి.

మర్డర్ మిస్టరీగా విడుదలైన నవంబర్ స్టోరీ లో తమన్నా ఎథికల్ హ్యాకర్ అనే అనురాధ పాత్రను పోషించింది. తన తండ్రి అల్జీమర్స్ చికిత్స కోసం ఇంటిని అమ్మే ప్రయత్నం చేస్తుంది. కానీ, ఇంతలో ఆ ఇంటిలో ఓ మర్డర్ జరుగుతోంది. దీనిలో తన తండ్రిని కాపాడి, తన చెల్లిని కాపాడుకునే పాత్రలో కనిపించింది.

కథ గురించి తమన్నా మాట్లాడుతూ, "దర్శకుడు రామ్ సుబ్రమణియన్ చెప్పిన కథ చాలా బాగా నచ్చింది. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్‌ను నేను ఎప్పుడూ చూడలేదు. ప్రేక్షకులు ప్రతీ ఎపిసోడ్‌ను ఆనందిస్తారని" తమన్నా చెప్పుకొచ్చింది. సాధారణ హత్యగా ప్రారంభమై.. ఎన్నో కీలక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చి అసలు మిస్టరీని విడదీస్తుంది.

ఏడు ఎపిసోడ్ల ఈ వెబ్ సిరీస్‌లో పశుపతి, జీఎం కుమార్, అరుల్దాస్, వివేక్ ప్రసన్న లాంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించారు. నిన్న విడుదలైన నవంబర్ స్టోరీ.. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అలాగే, లెవన్త్ అవర్ వెబ్ సిరీస్ కూడా అలరించడంలో విఫలమైంది. దీంతో రెండో పరాజయంతో వెబ్ సిరీస్‌లో తన సత్తా చాటలేకపోతోంది తమన్నా.

Venkata Chari

Venkata Chari

Next Story