Tamannaah: అడ్వాన్స్ తీసుకోకుండా ఇబ్బందులు పడుతున్న తమన్నా

"భోళా శంకర్" నిర్మాతల నుండి క్లారిటీ అడుగుతున్న తమన్నా

admin1
Updated on: 23 Oct 2021 5:19 PM IST
Tamannaah Bhatia Havent Received her Advance Fee from Bhola Shankar Movie Producers Yet
X

Tamannaah Bhatia: (Photo: Instagram) 

Tamannaah Bhatia - Bhola Shankar Movie: వరుస సూపర్ హిట్ సినిమాలతో కెరీర్ లో ముందుకు దూసుకుపోతున్న తమన్నాభాటియా ఈ మధ్యనే "మేస్ట్రో" సినిమా చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా "భోళా శంకర్" సినిమాలో నటిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆమె సినిమా కోసం సైనింగ్ ఫీ తీసుకోలేదట.

నిజానికి అడ్వాన్స్ తీసుకోకుండా ఏ హీరోయిన్ కూడా డేట్స్ ఇవ్వదు. పైగా ఇప్పుడు తమన్నాకి బాలీవుడ్ నుంచి కూడా బోలెడు ఆఫర్లు ముందుకు వస్తున్నాయి. ఇక ఇప్పుడు తమన్నాకి దిక్కుతోచని పరిస్థితి అయిపోయింది.

అందుకే "భోళా శంకర్" దర్శక నిర్మాతల నుంచి క్లారిటీ కోరుకుంటుంది. మరోవైపు కాజల్ అగర్వాల్ నాగార్జున హీరోగా నటిస్తున్న "ది ఘోస్ట్" సినిమా నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం ఇప్పుడు తమన్నా అని అనుకుంటున్నారట. ఇలా తమన్నాకి పలు భాషల నుంచి మంచి ఆఫర్లు లభిస్తున్నాయి. కానీ వాళ్లకి ఇవ్వాలి అంటే ముందు "భోళా శంకర్" నిర్మాతలు షూటింగ్ గురించి ఏదో ఒక అప్డేట్ ఇవ్వాల్సిందే. మరి తమన్నా ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి.

admin1

admin1

Next Story