Tamannaah Bhatia: బుల్లితెరలో హోస్ట్ గా ఎంట్రీ ఇస్తున్న మిల్కీ బ్యూటీ

Sandeep Reddy
Published on: 19 July 2021 6:16 PM IST
Tamannaah Bhatia Enters in First Small Screen Television Show on August Third week
X

తమన్నా (ఫైల్ ఫోటో) 

Tamannaah Bhatia: వెండితెరపై వెలుగొందిన హీరో హీరోయిన్స్ సినిమా అవకాశాలు లేక బుల్లితెరలోకి ఎంట్రీ ఇస్తుంటే అందుకు భిన్నంగా ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటూనే మరి కొంత మంది స్టార్ హీరో హీరోయిన్స్ బుల్లితెరపై వ్యాఖ్యతగా రకరకాల షోలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటివరకు చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, నాని వంటి హీరోలతో పాటు హీరోయిన్ సమంతా కూడా ఒకటి రెండు టాక్ షోలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తాజాగా వీరి బాటలోనే స్టార్ హీరోయిన్ తమన్నా కూడా నడవనుంది. తమన్నా హోస్ట్ గా ఒక ప్రముఖ టెలివిజన్ ఛానల్ ఒక షోని కూడా మొదలుపెట్టనుంది.

ఆ టెలివిజన్ షో యొక్క మొదటి ఎపిసోడ్ ని ఆగష్టు మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ షోకి సంబంధించిన ప్రోమోని కూడా అతి త్వరలో ఆ ఛానల్ విడుదల చేయనుంది. ఈ టెలివిజన్ షోతో హోస్ట్ గా తమన్నా బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించబోతుందని తెలుస్తుంది. ఇటీవలే ఓటీటీలో "నవంబర్ స్టోరీ", "ఎలెవన్ అవర్" వంటి వెబ్ సిరీస్ లలో కీలక పాత్రలో నటించిన తమన్నా ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిస్తున్న "ఎఫ్-3" చిత్రంలో వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటించనుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story