Tamannaah Book: తనలోని మరో యాంగిల్ ను బయటకు తీస్తున్న తమన్నా

admin1
Updated on: 26 Aug 2021 2:15 PM IST
Tamannaah Bhatia Co Author Back to the Roots Book Promoting Ancient Indian Wellness Practices on 30 08 2021
X

Tamannaah - (Photo: The Hans India)

Tamannaah Co-Author Book: ఒకవైపు వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న స్టార్ బ్యూటీ తమన్నా భాటియా మరోవైపు మాస్టర్ చెఫ్ తెలుగు వెర్షన్ తో త్వరలో బుల్లితెరపై కూడా హోస్ట్ గా మారనున్నారు. ఇప్పుడు తమన్నా ఒక రచయితగా కూడా తన ప్రతిభను చాటనున్నారు. ఈ మధ్యనే "బ్యాక్ టు ద రూట్స్" అనే ఒక ఆంగ్ల నవలకు సహ రచయిత్రిగా పనిచేశారు తమన్నా. ప్రముఖ లైఫ్ స్టైల్ కోచ్ లుక్ కౌటిన్హో తో కలిసి తమన్నా పుస్తకాన్ని పూర్తి చేశారు.

గతంలో "ది గ్రేట్ ఇండియన్ డైట్ విత్ శిల్పాశెట్టి" మరియు "ది మ్యాజిక్ వెయిట్ లాస్ పిల్ విత్ అనుష్క శెట్టి" వంటి బెస్ట్ సెల్లర్ నవలలకు రచన చేసిన లుక్ ఇప్పుడు తమన్నా తో కలిసి "బ్యాక్ టు ద రూట్స్" అనే నవలను విడుదల చేశారు. పాతకాలంలో మనదేశంలో సాధన చేసిన కొన్ని పద్ధతులు, రోగాలను నియంత్రిస్తూ అప్పటివారు తినే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల చుట్టూ ఈ నవల తిరుగుతూ ఉంటుంది. ఇక సినిమాల పరంగా కూడా తమన్నా చాలా బిజీ గా ఉన్నారు. సీటీమార్, ఘని, మేస్ట్రో, ఎఫ్ 3, గుర్తుందా శీతాకాలం, దట్ ఈజ్ మహాలక్ష్మి, ప్లాన్ ఏ ప్లాన్ బీ వంటి సినిమాలతో తమన్నా క్షణం తీరికలేకుండా గడిపేస్తుంది.

admin1

admin1

Next Story