అందుకే ఐటెం సాంగ్స్ చేస్తా అంటున్న తమన్నా

Ruthvik
Published on: 27 Feb 2019 5:01 PM IST
అందుకే ఐటెం సాంగ్స్ చేస్తా అంటున్న తమన్నా
X

ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం ఐటమ్ సాంగ్స్ అంటే స్టార్ హీరోయిన్ లే గుర్తొస్తున్నారు. ఒక వైపు సినిమాల్లో హీరోయిన్లుగా నటిస్తూ బిజీగా ఉన్న కొందరు హీరోయిన్లు కూడా ఐటం సాంగ్స్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. టాలీవుడ్ లో ఎక్కువ ఐటెం సాంగ్స్ లో నటించిన హీరోయిన్ గా తమన్నా గురించి చెప్పుకోవచ్చు. ఈ మధ్యనే ఈ మిల్కీ బ్యూటీ కన్నడ సినిమా 'కేజీఎఫ్' లో కూడా ఐటెం సాంగ్ లో మెరిసిన సంగతి తెలిసిందే. అయితే ఈమెకు ఈమె కేవలం డబ్బుల కోసమే ఐటమ్ సాంగ్స్ లో కనిపిస్తోంది అంటూ కొందరు ఆరోపణలు చేశారు.

వాటిపై ఈ మధ్యనే తమన్నా రియాక్ట్ అయింది. హీరోయిన్ గా నటించినప్పుడు ఎంతగా సంతృప్తి చెందుతానోఐటమ్ సాంగ్స్ చేసే సమయంలో కూడా అంతే సంతృప్తి చెందుతాను అని చెబుతోంది తమన్నా. అందుకే తాను ఐటమ్ సాంగ్స్ లో చేయడానికి ఆసక్తి చూపుతోందని ఇకపై కూడా ఐటమ్ సాంగ్స్ చేస్తా అని చెప్పుకొచ్చింది తమన్నా. ఇక తమన్నా 'దట్ ఇస్ మహాలక్ష్మి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి 'సైరా' సినిమాలో కూడా ఒక కీలక పాత్ర పోషిస్తోంది.

Ruthvik

Ruthvik

Next Story