Tamanna Bhatia: తమన్నా వర్కౌట్లు..ఫిదా అవుతున్న నెటిజన్లు!

K V D Varma
Published on: 8 Feb 2021 12:02 PM IST
Tamannah Bhatia work out image in instagram
X
మిల్కీ బ్యూటీ తమన్నా (ఇంస్టాగ్రామ ఫోటోలు) 

టాలీవుడ్ లో పదిహేనేళ్ళు.. 50 కి పైగా సినిమాలతో దూసుకుపోతున్న మిల్కీ బ్యూటీ తమన్నా. అందం..అభినయంతో ప్రేక్షకులను మెప్పించి ఇంకా తన అందచందాలతో హీరోయిన్ గా మరిన్ని సినిమాలు చేస్తోంది తమన్నా. హీరోయిన్ గా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన తమన్నా జోరు ఇప్పటికీ తగ్గలేదు. వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది. అంతే కాదు సోషల్ మీడియాలోనూ తమన్నా యమ యాక్టివ్. ఎప్పటికప్పుడు తన ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ వస్తోంది.

ఇక తమన్నా తన ఫిజిక్ కాపడుకోసం కోసం జిమ్ లో ఎక్కువ సమయం గడుపుతుంది. తాజాగా తాను జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఫోటోలు షేర్ చేసింది తమన్నా. పైగా ఆ ఫొటోకు ''మన శరీరాకృతి ఎలా ఉండాలో మన మైండ్ సెట్ చేస్తోంది. దానికి తగ్గట్టు కష్టపడితే.. అందమైన శరీరాకృతి మన వశం అవుతోంది'' అంటూ కామెంటూ జోడించింది. ఈ ఫోటో చూసి తమన్నా అభిమానులు ఫిదా అయిపోయారు.

ఇదిలా ఉంటె, తమన్నా గోపీచంద్ తో సీటీమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయి ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధం అవుతోంది. తెలంగాణా కబడ్డీ కోచ్ గా ఈ సినిమాలో కనిపించనుంది తమన్నా. ఇక నితిన్ హీరోగా వస్తున్న అంధాదున్ హిందీ రీమేక్ సినిమాలో బోల్డ్ పాత్రలో అలరించనుంది. ఈ సినిమాను మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ఠ మూవీస్ నిర్మిస్తోంది. హిందీలో టబు చేసిన పాత్రను తమన్నా తెలుగులో చేస్తోంది. నిజానికి ఈ పాత్ర హీరోయిన్ పాత్ర కాదు. కొంత విలనీ షేడ్ తో ఉంటూ హీరోకు సమానంగా సినిమా అంతా నడుస్తుంది. ఇది కాకుండా ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 లో కూడా తమన్నా సందడి చేయనుంది.

ఇంకా తమన్నా నటించిన గుర్తుందా శీతాకాలం, దటీజ్ మహాలక్ష్మి సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

K V D Varma

K V D Varma

Next Story