Acharya Movie: రెండు పాటలు మాత్రమే అంటున్న "ఆచార్య" చిత్రబృందం

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "ఆచార్య" కూడా ఒకటి.

admin1
Updated on: 4 Aug 2021 5:49 PM IST
Talkie of the Most Awaited film Acharya has been Completed
X

Acharya: రెండు పాటలు మాత్రమే అంటున్న "ఆచార్య" చిత్రబృందం

Acharya Movie: ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "ఆచార్య" కూడా ఒకటి. కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ మరియు పూజా హెగ్డే కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాను నిర్మిస్తున్న కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ ట్విట్టర్ వేదికగా షూటింగ్ గురించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ను విడుదల చేసింది.

సినిమాకి సంబంధించిన టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి అయిపోయింది అని, ఇంకా కేవలం రెండు పాటల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని ఆ ట్వీట్ సారాంశం. ఈ అప్డేట్ తో పాటు రామ్ చరణ్ మరియు చిరంజీవి కలిసి ఉన్న ఒక ఫోటోను కూడా షేర్ చేయగా ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

admin1

admin1

Next Story