రాములమ్మ స్థానంలో టబు

Ruthvik
Published on: 17 April 2019 11:37 AM IST
రాములమ్మ స్థానంలో టబు
X

టబు, విజయశాంతి ఇద్దరూ టాలెంటు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటీమణులే. కానీ ఇద్దరూ గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఒకవైపు విజయశాంతి రాజకీయాల్లో బిజీ అయిపోతే, మరొకవైపు టబు బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. అయితే తాజాగా విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వాల్సిన సినిమాతో ఇప్పుడు టబు రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. అసలు విషయానికి వస్తే 'నీది నాది ఒకే కథ' అనే సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు వేణు ఊడుగుల ఇప్పుడు 'విరాటపర్వం 1992' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో రానా దగ్గుబాటి, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం ముందుగా విజయశాంతి ని సంప్రదించారట. ఆమె కూడా ముందు ఒప్పుకున్నప్పటికీ తర్వాత డేట్లు కుదరకపోవడంతో తప్పుకున్నారు. ఇప్పుడు విజయశాంతి స్థానంలో టబు ని తీసుకొచ్చారని టాక్ వినిపిస్తోంది. ఎప్పుడో 2008 లో 'పాండురంగడు' చిత్రంలో ఆఖరిసారిగా తెలుగు తెరపై కనిపించిన టబు బన్నీ-త్రివిక్రమ్ సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్ర పోషించనుంది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తూ మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

Ruthvik

Ruthvik

Next Story