Hari Hara Veera Mallu: హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు నుంచి కొత్త అప్డేట్‌.. ‘తార తార’ పాట చూశారా.?

Hari Hara Veera Mallu
x

Hari Hara Veera Mallu: హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు నుంచి కొత్త అప్డేట్‌.. ‘తార తార’ పాట చూశారా.?

Highlights

Hari Hara Veera Mallu Song: ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎంత‌గానో ఎదురు చూస్తున్న సినిమా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు. ఇప్ప‌టికే చాలా సార్లు వాయిదా పడుతూ వ‌చ్చిన ఈ సినిమా ఎట్ట‌కేల‌కు జూన్ 12న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.

Hari Hara Veera Mallu Song: ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎంత‌గానో ఎదురు చూస్తున్న సినిమా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు. ఇప్ప‌టికే చాలా సార్లు వాయిదా పడుతూ వ‌చ్చిన ఈ సినిమా ఎట్ట‌కేల‌కు జూన్ 12న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమాపై ఊహ‌కంద‌ని అంచ‌నాలు నెల‌కొన్నాయి.

17వ శతాబ్దం మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీని జూన్ 12, 2025న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే సినిమా విడుద‌ల ద‌గ్గ‌ర‌ప‌డుతోన్న నేప‌థ్యంలో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్‌లో వేగాన్ని పెంచేసింది.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా మే 28న 'తార తార' అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నిధి అగ‌ర్వాల్ నేప‌థ్యంగా సాగే ఈ సాంగ్‌లో త‌న గ్లామ‌ర్‌తో మెస్మ‌రైజ్ చేసింది నిధి. పీరియాడిక్ నేపథ్యానికి తగ్గట్లుగా డిజైన్ చేసిన ఈ పాట విజువల్‌గా రిచ్‌గా ఉన్నాయి.

ఇక ఈ పాటకు శ్రీ హర్ష చక్కటి సాహిత్యాన్ని అందించగా, గాయకులు లిప్సిక, ఆదిత్య సునాయక గాత్రాన్ని అందించారు. ఈ పాట‌కు కీర‌వాణి సంగీతం అందించారు. ప్ర‌స్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో వైర‌ల్ అవుతోంది.

ఈ చిత్రాన్ని ఏ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు. యాక్షన్, డ్రామా, చారిత్రక నేపథ్యం మేళవింపుతో రూపొందుతున్న ఈ చిత్రం పవన్ అభిమానులకు ఒక స్పెషల్ ట్రీట్‌గా మారనుంది. మ‌రి ఇన్ని అంచ‌నాల న‌డుమ తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ఎలాంటి వండ‌ర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.



Show Full Article
Print Article
Next Story
More Stories