సమంత బాలీవుడ్ ఎంట్రీ.. అసలు విషయం బయటపెట్టిన తాప్సీ..

Taapsee Pannu: ఎటువంటి బాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకొని...

Arun Chilukuri
Published on: 5 July 2022 2:54 PM IST
Taapsee Pannu to Produce a Film With Samantha
X

సమంత బాలీవుడ్ ఎంట్రీ.. అసలు విషయం బయటపెట్టిన తాప్సీ..

Taapsee Pannu: ఎటువంటి బాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడు కమర్షియల్ సినిమాలకి దూరంగా కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ కరియర్లో ముందుకు దూసుకు వెళుతున్న హీరోయిన్లలో సమంత మరియు తాప్సీల పేర్లు ముందే ఉంటాయి. అలాంటిది ఇద్దరి కలయికలో ఒక సినిమా వస్తే అది అభిమానులకి కన్నుల విందుగా ఉంటుందని చెప్పుకోవచ్చు.

గత కొంతకాలంగా తాప్సీ బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ మంచి పేరు సంపాదించింది. ఈ మధ్యనే "ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2" లో నటించిన సమంత కూడా హిందీ ప్రేక్షకులకు సుపరిచితురాలే. తాజాగా సమంత హీరోయిన్ గా తాప్సి ఒక సినిమాని నిర్మిస్తున్నట్లుగా గత కొంతకాలంగా వార్తలు వినిపించాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీని గురించి ఓపెన్ అయింది తాప్సీ.

త్వరలో విడుదల కాబోతున్న తన "శభాష్ మిత్తు" సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ సమంతతో తాను నిర్మించనున్న సినిమా గురించి కూడా చెప్పుకొచ్చింది తాప్సి. ఆ సినిమాలో తను ఎలాంటి పాత్ర చేయడం లేదని కేవలం సమంత మాత్రమే హీరోయిన్ గా పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తుందని, ఇక ఆ పాత్రకి సమంతానే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని చెప్పుకొచ్చారు తాప్సీ. ఇక వీరిద్దరి కలయికలో ఈ సినిమా వస్తుంది కానీ ఇద్దరు కలిసి వెండితెరపై కనిపించరని చెప్పుకోవచ్చు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story