Taapsee Pannu: సౌత్ ఇండస్ట్రీ పై కామెంట్లు చేస్తున్న తాప్సి

Taapsee Pannu Sensational Comments On South Film Industry
x

Taapsee Pannu: సౌత్ ఇండస్ట్రీ పై కామెంట్లు చేస్తున్న తాప్సి 

Highlights

Taapsee Pannu: సౌత్ ఇండస్ట్రీ నుంచి తనకి అలాంటి పాత్ర లే రాలేదు అంటున్న తాప్సి..

Taapsee Pannu: ఏదైనా సినిమా విడుదల అవుతున్న సమయంలో కొన్ని వివాదాస్పద కామెంట్లు చేసి మరీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు కొంతమంది హీరోయిన్లు. ఈ మధ్యనే తమన్నా కూడా సౌత్ ప్రేక్షకులు తనని మిల్కీ అని తెలుస్తారని కానీ తనకి అది ఏమాత్రం నచ్చదు అంటూ కామెంట్లు చేసింది. మరోవైపు బాలీవుడ్ నటి రాధిక ఆప్టే కూడా సౌత్ లో ఒక స్టార్ హీరో తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పుకొచ్చారు. కానీ ఈ మధ్యకాలంలో ఈ ట్రిక్కులు పెద్దగా వర్క్ అవుట్ అవ్వడం లేదు. కానీ తాప్సీ పన్ను మాత్రం మళ్లీ మళ్లీ ఇలాంటి స్ట్రాటజీ వాడి అందరి దృష్టిలో పడడానికి ప్రయత్నాలు చేస్తోంది.

తెలుగులో చాలానే గ్లామర్ పాత్రలలో నటించినప్పటికీ అనుకున్న స్థాయి స్టార్ డం ని మాత్రం సంపాదించలేక పోయింది తాప్సి. ఇక టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గిపోతున్న సమయంలో బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయింది. గ్లామర్ పాత్రలు మాత్రమే కాకుండా పర్ఫామెన్స్ కి ప్రాధాన్యత ఉన్న పాత్రలు కూడా దక్కించుకొని మంచి గుర్తింపు తెచ్చుకుంది తాప్సి. త్వరలోనే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా "డంకీ" అనే సినిమాలో కూడా నటించబోతోంది ఈ భామ. అయితే ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ పై టాప్సీ చేసిన కొన్ని కామెంట్లు అందరికీ షాక్ ఇస్తున్నాయి.

సౌత్ ఇండస్ట్రీ అసలు ఇప్పటివరకు తన నటన చాతుర్యతను చూపించగల పాత్రలను ఇవ్వలేదని చెబుతోంది తాప్సి. కానీ మంచి పాత్రలు దొరకకుండా అన్ని తెలుగు సినిమాలలో ఎందుకు నటించావు అని అభిమానులు సైతం ప్రశ్నిస్తున్నారు. తెలుగు సినిమాలు ఎక్కువగానే చేసి డబ్బులు సంపాదించేసి ఇప్పుడు మళ్ళీ సౌత్ ఇండస్ట్రీ మీద కామెంట్లు చేస్తోంది అంటూ మరికొందరు అంటున్నారు. ఇదంతా తాప్సీ కేవలం పబ్లిసిటీ కోసమే చేస్తోంది అని మరికొందరు కొట్టి పారేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories