Taapsee Pannu: నా శృంగార జీవితం అంత ఆసక్తికరంగా లేదు..

Taapsee Pannu On Koffee With Karan Show: బాలీవుడ్ లో భిన్నమైన సినిమాలు చేస్తూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించింది పంజాబీ బ్యూటీ తాప్సీ పన్ను.

Arun Chilukuri
Published on: 8 Aug 2022 3:25 PM IST
Taapsee Pannu On Why Shes Not Invited To Koffee With Karan
X

Taapsee Pannu: నా శృంగార జీవితం అంత ఆసక్తికరంగా లేదు..

Taapsee Pannu On Koffee With Karan Show: బాలీవుడ్ లో భిన్నమైన సినిమాలు చేస్తూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించింది పంజాబీ బ్యూటీ తాప్సీ పన్ను. ఈ ముద్దుగుమ్మ రీసెంట్‌గా త‌న శృంగార జీవితం గురించి చేసిన వ్యాఖ్య‌లు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. అస‌లు ఈమె ఎందుకలాంటి వ్యాఖ్య‌లు చేసిందనే వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌స్తుతం తాప్సీ ప‌న్ను క‌థానాయిక‌గా న‌టించిన చిత్రం 'దొబారా' ఆగ‌స్ట్ 19న రిలీజ్ అవుతుంది. 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమానికి తాప్సీ పన్ను ఎందుకు వెళ్లలేదన్నది బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది.

ఈ నేపథ్యంలోనే ఆమెకి అందుకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. 'మీరెందుకు మీ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు కాఫీ విత్ కరణ్ షోకి వెళ్లలేదు' అని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. 'కాఫీ విత్ కరణ్‌'కి ఆహ్వానించేలా ఆసక్తికరంగా నా శృంగార జీవితం లేదు'' అని ఆమె వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. ఆమె ఇచ్చిన సమాధానంతో అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు. కరణ్‌ షోపై ఆమె పరోక్షంగా కౌంటర్‌ విసిరిందని మాట్లాడుకుంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story