నిరాశ చెందుతున్న మెగా అభిమానులు

నిరాశ చెందుతున్న మెగా అభిమానులు
x
Highlights

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'సై రా' పైన భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. మొట్ట మొదటి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహ...

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'సై రా' పైన భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. మొట్ట మొదటి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా మొదట ఆగస్టులో విడుదల కాబోతోందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాను అక్టోబర్ లో దసరా సందర్భంగా విడుదల చేయబోతున్నారు అని టాక్ నడిచింది. కానీ ఈ విషయమై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. ఒకవైపు అభిమానులు కౌంట్ డౌన్ మొదలు పెట్టేసారు కానీ మరొకవైపు రామ్ చరణ్ కనీసం దీని గురించి ట్వీట్ కూడా చేయలేదు.

పైగా ఈ సినిమాను నార్త్ లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కాబట్టి సినిమా ప్రమోషన్లపై కూడా బాగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎప్పుడో విడుదలైన టీజర్ తప్ప ఈ సినిమా గురించిన పోస్టర్ కూడా ఈ మధ్యకాలంలో విడుదల అవలేదు. ఈ విషయంలో అభిమానులు కూడా కొంత నిరాశ చెందుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా కనీసం అక్టోబర్ 2న విడుదల అవుతుందో లేదో ఇంకా తెలియాల్సి ఉంది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ కిచ్చా, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories