బిగ్ బాస్ సెట్స్ లో 'సైరా' షూటింగ్

బిగ్ బాస్ సెట్స్ లో సైరా షూటింగ్
x
Highlights

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా నరసింహ రెడ్డి' సినిమా పైన భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా...

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా నరసింహ రెడ్డి' సినిమా పైన భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో 90 శాతం టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలో అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక కీలకమైన షూటింగ్ షెడ్యూల్ మొదలు కానుంది. కోకాపేటలో చిరు ఫామ్ హౌస్ లో వేసిన సైరా సెట్ మంటల్లో కాలిపోయిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో షూటింగ్ ను ఆలస్యం చేయకుండా 'సైరా' ప్రొడక్షన్ డిజైన్ టీం 7 ఎకరాల్లో సినిమా కోసం భారీ సెట్ డిజైన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా బిగ్ బాస్ సెట్స్ పై కూడా 'సైరా' సినిమా లోని ఒక పాట షూటింగ్ జరగబోతోందని తెలుస్తోంది. నిర్మాత రామ్ చరణ్ కేవలం ఈ ఒక్క పాట కోసం రెండు కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నట్లు సమాచారం. అమితాబచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, సుదీప్ జగపతిబాబు తమన్నా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories