Shalini Pandey: చెప్పకుండా ఎక్కడికో తీసుకెళ్లారట..!

Shalini Pandey: "అర్జున్ రెడ్డి" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ షాలిని పాండే.

Arun Chilukuri
Updated on: 25 Sept 2022 1:00 PM IST
Sweet Surprise for Shalini Pandey
X

Shalini Pandey: చెప్పకుండా ఎక్కడికో తీసుకెళ్లారట..!

Shalini Pandey: "అర్జున్ రెడ్డి" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ షాలిని పాండే. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ భామ ఆ తరువాత మాత్రం తన సినిమాలతో మంచి విజయాలను సాధించలేకపోయింది. ఇక గ్లామరస్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు బికినీ ఫోటోలు పెట్టి అభిమానులకి సర్ప్రైజ్ ఇస్తూ ఉంటుంది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈమెకు స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు మాత్రం రావడం లేదు.

తాజాగా తన సోదరితో కలిసి పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నట్లుగా చెప్పుకొచ్చింది షాలిని. అయితే ఆ సమయంలో ఆమె స్నేహితులు అందరూ కలిసి ఆమెను వెంటనే బ్యాగ్ సర్దుకోవాలని ఒక తెలియని ప్రదేశానికి వెళ్ళబోతున్నాము అని చెప్పారట. విమానాశ్రయానికి వెళ్లే వరకు తాను ఎక్కడికి వెళుతుందో కూడా తెలియకుండా సర్ప్రైజ్ చేశారట.

ఇలాంటి సర్ప్రైజ్ టూర్స్ చాలా బాగుంటాయి అని సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది షాలిని పాండే. ఇక సినిమాల పరంగా చూస్తే షాలిని పాండే బాలీవుడ్ లో కూడా పలు సినిమాలతో బిజీగా ఉంది. ఈమధ్యనే రన్వీర్ సింగ్ హీరోగా నటించిన "జయేష్ భాయ్ జోర్దార్" సినిమాలో కనిపించింది ఈ భామ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story