Colours Swathi: 'స్వాతి రెడ్డి' రీ ఎంట్రీ ఇవ్వనున్న సినిమా ఇదే..!

Swathi Excited about Tollywood Comeback With Panchatantram Movie
x

స్వాతి రెడ్డి (ఫొటో దిహాన్స్ ఇండియా)

Highlights

Colours Swathi: స్వాతి రెడ్డి అలియాస్ కలర్స్ స్వాతి.. దాదాపు 4 సంవత్సరాల తరువాత టాలీవుడ్ లోకి తిరిగి వస్తోంది.

Colours Swathi: స్వాతి రెడ్డి అలియాస్ కలర్స్ స్వాతి దాదాపు 4 సంవత్సరాల తరువాత టాలీవుడ్ లోకి తిరిగి వస్తోంది. 'పంచతంత్రం' పేరుతో రాబోయే తెలుగు సినిమాలో ఈ నటి కీలక పాత్రలో కనిపించబోతోంది. ఈ చిత్రంలో చాలా మంది ప్రతిభావంతులైన నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇక నుంచి వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్నాను. అయితే ఇంత వరకు తీసుకున్న గ్యాప్‌ చాలని, మంచి ఆఫర్ల కోసం ఇన్నాళ్లు ఎదురుచూసినట్లు" ఆమె వెల్లడించింది. హీరోయిన్ పాత్రలతో పాటు ప్రత్యేక పాత్రలను ఇకపై చేస్తానని స్వాతి ప్రకటించింది.

ఈ నటి ఇప్పటికే కొంతమంది చిత్రనిర్మాతలతో చర్చలు చేస్తోంది. త్వరలోనే మరిన్ని చిత్రాలను కూడా ప్రకటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. 'పంచతంత్రం' సినిమాలో స్వాతి కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ చిత్రంతో మరోసారి ఆకట్టుకునే ముద్ర వేయాలని భావిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories