Swapna Dutt: అలా విజయ్ దేవరకొండతో రెండు సినిమాలు మిస్ అయ్యాను..

Swapna Dutt: "విజయ్ దేవరకొండ సినిమాలు మిస్ చేసుకున్నాను," అంటున్న నిర్మాత

Jyothi
Updated on: 10 March 2023 9:31 PM IST
Swapna Dutt says She Missed Two films with Vijay Deverakonda
X

"అలా విజయ్ దేవరకొండ తో రెండు సినిమాలు మిస్ అయ్యాను అంటున్న" స్వప్న దత్

Swapna Dutt: టాలీవుడ్ నిర్మాత అశ్విని దత్ కూతురు స్వప్న దత్ గురించి తెలియని వారు ఉండరు. 2005లో "సుభాష్ చంద్రబోస్" అనే సినిమాతో నిర్మాతగా మారిన స్వప్న దత్ చాలాకాలం ఇండస్ట్రీ నుంచి గ్యాప్ తీసుకుని మళ్లీ 2015లో "ఎవడే సుబ్రహ్మణ్యం" సినిమాతో మళ్లీ ప్రేక్షకులను పలకరించారు. ఇక 2018లో "మహానటి" 2022లో "సీతారామం" సినిమాలతో కూడా బ్లాక్ బస్టర్లు అందుకొని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.

వైజయంతి మూవీస్ పతాకం పై వచ్చే సినిమాలు కచ్చితంగా బాగుంటాయి అని ప్రేక్షకులలో కూడా నమ్మకం ఏర్పడింది స్వప్న దత్ స్టోరీ సెలక్షన్ కారణంగానే. అయితే అలాంటి స్వప్న దత్ కూడా రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించడానికి నో చెప్పారట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ సినిమాల గురించి చెప్పారు స్వప్న దత్. "అసలైతే అర్జున్ రెడ్డి సినిమాని నేనే నిర్మించాలి అనుకున్నాను కానీ అప్పుడు నాకు ధైర్యం సరిపోలేదు.

కొంచెం అటూ ఇటూ అయినా కూడా ఆడపిల్ల ఇలాంటి సినిమా తీసింది ఏంటి అని బ్యాడ్ కామెంట్లు వస్తాయి అని భయమేసింది. ఇక పెళ్లి చూపులు సినిమా విషయం లో నేను సరిగ్గా నిర్ణయం తీసుకోకపోయాను. అందుకే వద్దు అనుకున్నాను. అలా విజయ్ దేవరకొండ తో రెండు సినిమాలు మిస్ అయ్యాను," అని చెప్పుకొచ్చారు స్వప్న దత్. రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ లుగా మారడమే కాక చిన్న సినిమాలు కూడా భారీ కలెక్షన్లు అందుకోగలవు అని నిరూపించాయి.

Jyothi

Jyothi

Next Story