OTT Movie: భర్తను చంపి భార్యను అనుభవించిన సైకో కిల్లర్.. అమెజాన్ ప్రైమ్ లో సస్పెన్స్ థ్రిల్లర్..!

Suspense Thriller Ore Mukham Streaming on Amazon Prime Video
x

OTT Movie: భర్తను చంపి భార్యను అనుభవించిన సైకో కిల్లర్.. అమెజాన్ ప్రైమ్ లో సస్పెన్స్ థ్రిల్లర్..!

Highlights

OTT Movies: ఈ మధ్య కాలంలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది. అలాంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబట్టుతున్నాయి.

OTT Movies: ఈ మధ్య కాలంలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది. అలాంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబట్టుతున్నాయి. దీంతో డైరెక్టర్లంతా అలాంటి సినిమాలు తీయడం పైనే దృష్టి పెడుతున్నారు. అంతే కాకుండా మలయాళం నుంచి ఎక్కువగా విజయాలను నమోదు చేసుకుంటుండడంతో తెలుగులో కూడా వాటికి ఆదరణ పెరుగుతోంది. ఇలాంటి మంచి కథలను చక్కగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నారు మేకర్స్. కథలో పలు ట్విస్ట్ లతో అదరగొడుతుండడంతో ఈ సినిమాలను చూడటానికి సినీప్రేమికులు ఆసక్తి చూపుతున్నారు. సస్పెన్స్ తో థ్రిల్లింగ్ కల్పించే అలాంటి మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ సస్పెన్స్ థ్రిల్లర్ ఏంటో చూద్దాం.

సస్పెన్స్ థ్రిల్లర్ మూవీనే ‘ఒరే ముఖం‘. ఈ మలయాళ థ్రిల్లర్ సాజిత్ జగద్నందన్ డైరెక్షన్ లో తెరకెక్కింది. ఇందులో ధ్యాన్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించారు. సినిమా కథ మొత్తం 1980ల నాటి కాలంలోని కాలేజీ రోజుల చుట్టూ నడుస్తుంది. ఒరే ముఖం డిసెంబర్ 2, 2016న విడుదలైంది. ట్విస్ట్ లతో సాగిపోయే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ OTT ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

సినిమా ప్రారంభంలో, ఒక హత్య కేసు సంచలనం రేపుతుంది. అదే అరవింద్ మర్డర్ కేసు. పోలీస్ ఆఫీసర్ ఈ కేసు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాడు. అయితే, న్యూస్ రిపోర్టర్ అమల ఈ కేసు ముందు సరిగ్గా వివరాలు బయటపెట్టాలని భావిస్తుంది. అమల వందేళ్ల నాటి కాలేజీకి వెళ్ళి పోతన్ అనే వ్యక్తి దారుణంగా మరణించిన వారి వెనుక ఉండని తెలుసుకుంటుంది. అమల పోలీసులకు ముందే ఈ వివరాలను చెప్పాలని ప్రయత్నిస్తుంటే, పోతన్ అసలు ఎక్కడ ఉన్నాడు అన్నది ఎవరికి కూడా తెలియదు. పోతన్ అతి ప్రమాదకరమైన వ్యక్తి, అమ్మాయిలను వేధించడం, హింసించడం లాంటి తదితర దారుణాలు చేసిన వ్యక్తి. కాలేజీలో ఒక అమ్మాయిని పోతన్ వేధిస్తుంటే దేవ్ అనే వ్యక్తి అడ్డుపడి బుద్ధి చెబుతాడు. ఆ తర్వాత వాళ్లతో మంచిగానే ఉంటూ వాళ్లిద్దరికీ పెళ్లి చేస్తాడు పోతన్.

ఆ తర్వాత మొదటి రాత్రే దేవ్ ని చంపి, గాయత్రిని అనుభవిస్తాడు పోతన్. ఆ తర్వాత ఆమెను కూడా దారుణంగా చంపేస్తాడు. ఈ జంట హత్యలు అప్పట్లో సంచలనం అవుతాయి. అప్పటినుంచి పోతన్ కనిపించకుండా పోతాడు. ఇందులో భాగంగానే అరవింద్ ప్రేమించిన అమ్మాయి విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. అరవింద్ ని ఓ అమ్మాయి విషయంలోనే చంపాడని తెలుసుకుంటుంది. చివరికి పోతన్ పోలీసులకు దొరుకుతాడా? అరవింద్ ని పోతనే చంపేస్తాడా ? రిపోర్టర్ అమల వెలుగులోకి తెచ్చే విషయాలు ఏమిటి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘ఒరే ముఖం’ మూవీని మిస్ కాకుండా చూడండి.

Show Full Article
Print Article
Next Story
More Stories