OTT Movie: భర్త ఆర్మీలో దేశ సేవలో బిజీగా ఉంటే.. భార్య ప్రెగ్నెంట్.. ట్విస్టులతో మతిపోగొట్టే థ్రిల్లర్

OTT Movie: భర్త ఆర్మీలో దేశ సేవలో బిజీగా ఉంటే.. భార్య ప్రెగ్నెంట్.. ట్విస్టులతో మతిపోగొట్టే థ్రిల్లర్
x

OTT Movie: భర్త ఆర్మీలో దేశ సేవలో బిజీగా ఉంటే.. భార్య ప్రెగ్నెంట్.. ట్విస్టులతో మతిపోగొట్టే థ్రిల్లర్

Highlights

OTT Movie: ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక రకాల కథలతో సినిమాలు వస్తున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీల్లో భారీ ఫాలోయింగ్ ఉంటుంది.

OTT Movie: ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక రకాల కథలతో సినిమాలు వస్తున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీల్లో భారీ ఫాలోయింగ్ ఉంటుంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే తమిళ మూవీ సస్పెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రెగ్నెంట్ మహిళ చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ మూవీ పేరు ‘బర్త్‌మార్క్’ (BirthMark). 2024 లో వచ్చిన ఈ మూవీ విక్రమ్ శ్రీధరన్ దర్శకత్వంలో వచ్చింది. ఈ తమిళ భాషా థ్రిల్లర్ డ్రామా మూవీలో షబీర్ కల్లరక్కల్, మీర్నా మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. సేపియన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై విక్రమ్ శ్రీధరన్, శ్రీరామ్ శివరామన్ ఈ సినిమాను నిర్మించారు.ఓ ఆర్మీ ఉద్యోగి భార్యను వదిలి డ్యూటీకి వెళ్తాడు. అయితే అతడు వెళ్లి కొన్నేళ్ల తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. ఆమెకు తర్వాత ఎదురయ్యే సమస్యలకు సంబంధించిన సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.

కథలోకి వెళితే.. డేనియల్, జెన్నీఫర్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వీళ్లకు పిల్లలు కావాలని కలలు కంటారు. అయితే ఇంతలోనే డేనియల్ కు ఆర్మీ నుంచి పిలుపు వస్తుంది. అతడు ఆర్మీ ఉద్యోగి కావడంతో డ్యూటీకి వెళ్లాల్సి వస్తుంది. ఆ తర్వాత బాధగా అక్కడ నుంచి భార్యను వదిలి వెళ్తాడు. ఏడు నెలల తర్వాత మళ్ల ఇంటికి వస్తాడు. అప్పటికే జెన్నీఫర్ ఏడు నెలల గర్భిణీగా ఉంటుంది. తన భార్యకి సాధారణ డెలివరీ కోసం, ఒక మారుమూల ప్రాంతానికి తీసుకెళ్తాడు. ఆ ప్రాంతం చాలా మిస్టరీగా ఉంటుంది. వాళ్లందరినీ చూసి జెన్నీఫర్ చాలా భయపడుతుంది. భర్త సర్ది చెప్పడంతో తను అక్కడ ఉండేందుకు ఒప్పుకుంటుంది. డేనియల్ ఒక రకమైన డిప్రెషన్ తో బాధపడుతుంటాడు. అతడికి ఆర్మీలో చేదు అనుభవాలు ఎదురవుతాయి. మరోవైపు బిడ్డకు ప్రమాదం ఉందని ఒక మంత్రసాని చెబుతుంది.

అందులోనే జెన్నీఫర్, భర్త రాసిన ఒక డైరీ ని చదువుతుంది. అందులో ఉన్న మేటర్ చూసి జెన్నీఫర్ షాక్ అవుతుంది. ఆ డైరీలో ఈ బిడ్డ నా బిడ్డ కాదని చాలాసార్లు రాసి ఉంటుంది. జన్నీఫర్ కి అనుమానం వస్తుంది. తన భర్త కావాలనే ఇక్కడికి తీసుకొచ్చి తన బిడ్డను చంపే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థం అవుతుంది. చివరికి జెన్నీఫర్ కి నార్మల్ డెలివరీ అవుతుందా? భర్త ఆ బిడ్డను చంపేస్తాడా అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories