Chiranjeevi Movies: చిరు స్పీడుకి కారణం ఈమేనా?

Chiranjeevi New Movies 2022: సుష్మిత వల్లే స్పీడు పెంచిన చిరంజీవి

admin1
Updated on: 12 Dec 2021 8:00 PM IST
Sushmitha Konidela Takes care of Costume Designs and Movie Dates Adjusting for Her Father Megastar Chiranjeevi
X

చిరు స్పీడ్ కి వెనకాల ఉన్న ప్రధాన కారణం చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదల

Chiranjeevi New Movies 2022: ఈ మధ్యన వరసగా నాలుగు సినిమాలు షూటింగ్ కి తీసుకువెళ్లి మెగాస్టార్ చిరంజీవి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. యువ హీరోలు సైతం సంవత్సరానికి ఒక సినిమా చేయడానికి నానా కష్టాలు పడుతుంటే చిరంజీవి ఇలా ఏకంగా ఒకేసారి నాలుగు సినిమాలు ఈ వయసులో చేయటం నిజంగా షాకింగ్ విషయమే. ఈ నెలలో చిరంజీవి ఈ నాలుగు సినిమాలకు ఇతను డేట్లను కేటాయించారు. చిరంజీవి మాత్రమే కాక ఏ హీరో కెరీర్ అయినా ఇది చాలా అరుదైన అంశం. నిజానికి చిరంజీవి కి ఇంత కంగారు గా సినిమాలు చేయాలని ఏమాత్రం లేదు.

60 ఏళ్లు దాటిన తర్వాత తన కరియర్ ని ఇంత స్పీడ్ గా పరుగులు పెట్టించాలని చిరంజీవి అనుకోలేదు. కానీ చిరు స్పీడ్ కి వెనకాల ఉన్న ప్రధాన కారణం చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదల. చిరంజీవికి సంబంధించిన కాస్ట్యూమ్స్ చూసుకున్న సుష్మిత చిరు ప్రాజెక్టులు కూడా సెట్ చేస్తోంది. అంతేకాక చిరంజీవి పారితోషికాలు డీల్ చేయడం దగ్గర్నుంచి డేట్లు సర్దుబాటు చేయడం వరకు అన్ని ఆమె దగ్గరుండి చూసుకుంటోంది. చూస్తూ ఉంటే మరో రెండు మూడేళ్లు కూడా చిరంజీవి ఇంత ఇదే స్పీడు పాటించేలా కనిపిస్తున్నారు.

admin1

admin1

Next Story