బన్నీ త్రివిక్రమ్ సినిమాలో అక్కినేని హీరో కామెడీ

బన్నీ త్రివిక్రమ్ సినిమాలో అక్కినేని హీరో కామెడీ
x
Highlights

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా డిజాస్టర్ తర్వాత కొన్ని నెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్న అల్లు అర్జున్ ఎట్టకేలకు తన తదుపరి సినిమా మాటల...

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా డిజాస్టర్ తర్వాత కొన్ని నెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్న అల్లు అర్జున్ ఎట్టకేలకు తన తదుపరి సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఉండబోతోందని ప్రకటించాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ముహూర్తం షాట్ ను కూడా పూర్తి చేసి ఈ సినిమాను అధికారికంగా లాంచ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సుశాంత్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

అక్కినేని కుటుంబ సభ్యుడిగా సుశాంత్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు కానీ చాలాకాలంపాటు డిజాస్టర్ లను మాత్రమే చవిచూశాడు. ఈ మధ్యనే సుశాంత్ నటించిన 'చిలసౌ' సినిమా హిట్ అయింది. ఇప్పుడు సుశాంత్ బన్నీ త్రివిక్రమ్ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడని తెలుస్తోంది. కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో సుశాంత్ పరిస్థితులను అర్థం చేసుకోవడంలోనూ వాటి పై రియాక్ట్ అవ్వడం లోనూ ఆలస్యం చేసేవాడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో సుశాంత్ పాత్ర బాగా నవ్వు తెప్పిస్తుందని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories