Sanjana Sanghi: ముంబైకి వీడ్కోలు పలికిన సుశాంత్ హీరోయిన్!

Sanjana Sanghi :బాలీవుడ్ సంచలనం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గత నెల 14న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

Krishna
Published on: 2 July 2020 2:00 PM IST
Sanjana Sanghi: ముంబైకి వీడ్కోలు పలికిన సుశాంత్ హీరోయిన్!
X

Sanjana Sanghi: బాలీవుడ్ సంచలనం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గత నెల 14న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిన సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు.. అయితే అనే అతను ఆత్మహత్యను ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఫ్యూచర్ స్టార్ గా మంచి భవిష్యత్ ఉన్న సుశాంత్ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం అందరినీ కలవరపరిచింది.సుశాంత్ మరణం పట్ల అతనితో పనిచేసిన యాక్టర్స్, హీరోయిన్స్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

ఇక సుశాంత్ చివరగా నటించిన 'దిల్ బేచారా' హీరోయిన్ సంజనా సాంఘి తీవ్ర బావోద్వేగంలో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా తన ఇనస్టాగ్రామ్ ఖాతాలో... "బై ముంబై. నేను ఢిల్లీకి తిరిగి వెళ్లిపోతున్నాను. వీధులన్ని చాలా కొత్త‌గా, వింత‌గా క‌నిపిస్తున్నాయి. బ‌హుశా నా గుండెల్లోని బాధ వ‌ల‌న చూపు అలా మారిందేమో! త్వరలోనే మళ్లీ కలుస్తాం. లేకుంటే కలవలేకపోవచ్చు.. అని సంజ‌న త‌న పోస్ట్‌లో పేర్కొంది. ఇక సుశాంత్ ఆత్మహత్య తరువాత పోలీసులు ఆమెను ఏడూ గంటల పాటుగా విచారించిన సంగతి తెలిసిందే.. ఇక సంజన సంఘి తొలిసారిగా రణబీర్ కపూర్ రాక్ స్టార్ సినిమాలో నటించింది.

సుశాంత్ చివరగా నటించిన 'దిల్ బేచారా' (Dil Bechara) సినిమాని త్వరలో అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు..వచ్చే నెల 24న ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney Plus Hotstar) లో విడుదల చేయనున్నారు.. ఈ సినిమాను ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తున్నారు. హాలీవుడ్ లో వచ్చిన 'ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్'కు ఈ సినిమా రీమేక్ గా తీశారు. ముఖేశ్ చాబ్రా తొలిసారిగా దర్శకత్వం వహించారు.. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.

Krishna

Krishna

Next Story